ఈ5 అందాన్ని పెంచుతాయి..

ముఖం మెరుపులీనాలన్నా.. శరీరచర్మం తళుక్కుమనాలన్నా.. ఈ అయిదు విటమిన్లు నిత్యావసరం అంటున్నారు నిపుణులు.

Updated : 29 Nov 2022 05:28 IST

ముఖం మెరుపులీనాలన్నా.. శరీరచర్మం తళుక్కుమనాలన్నా.. ఈ అయిదు విటమిన్లు నిత్యావసరం అంటున్నారు నిపుణులు. వీటిని రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే.. అందమైన చర్మం మీ సొంతమని చెబుతున్నారు. 


విటమిన్‌

యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు నిండుగా ఉండే విటమిన్‌ ఎ చర్మకాంతికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై మచ్చలను తగ్గిస్తాయి. సూర్యకిరణాల నుంచి రక్షించే గుణాలు ఇందులో ఉండటంతో సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ తయారీలోనూ దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. పాలు, గుడ్లు, గింజ ధాన్యాలు, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలను తీసుకుంటే సహజసిద్ధంగా విటమిన్‌ ఎ ను పొందొచ్చు.


విటమిన్‌ సి

చర్మంపై అద్భుతాలు చేస్తుంది ‘సి’. మచ్చలు, పిగ్మంటేషన్‌ను తగ్గిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచి సాగే గుణాన్ని అందించి, ఆరోగ్యంగా మార్చే శక్తి ఇందులో ఉంది. నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లు, కాలీఫ్లవర్‌, బ్రొకోలీ వంటి కూరగాయల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే చాలు. చర్మం మెరుపు లీనుతుంది.


విటమిన్‌ డి

ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే ‘డి’, చర్మాన్నీ.. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయపుటెండలో సహజసిద్ధంగా లభించే ఇది ముందుగానే వచ్చే వృద్ధాప్యాన్ని దరికి చేరనివ్వదు. ముఖంపై గీతలు, ముడతలను దూరం చేసి, ముఖారవిందాన్ని మెరిసేలా చేస్తుంది. ఎండ కన్నెరగకుండా నాలుగ్గోడల మధ్యే ఉద్యోగం చేసే వారు వైద్యులను సంప్రదించి సప్లిమెంట్స్‌ తీసుకుంటే చర్మానికి సంబంధించిన అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.


విటమిన్‌

చర్మాన్ని తేమగా, మృదువుగా మెరిసేలా చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. సూర్యకిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఇది సంరక్షిస్తుంది. చర్మాన్ని పొడారకుండా కాపాడుతుంది. వెజిటబుల్‌ ఆయిల్‌, ఆకు పచ్చని కూరగాయలు, విత్తనాలు, గింజలను ఆహారంలో తీసుకోవడం ద్వారా దీన్ని పొందొచ్చు. మృదువైన చర్మం సొంతమవుతుంది.


విటమిన్‌ కె

బరువు తగ్గినప్పుడు, ప్రసవం తర్వాత ఏర్పడే స్ట్రెచ్‌ మార్కులు, మచ్చలు, పిగ్మంటేషన్‌, కంటికింద వలయాలు వంటివాటికి ఇది సహజ ఔషధం లాంటిది. చర్మంపై ఏర్పడే గాయాలు, పుండ్లు, వాపులు వంటి వాటికీ ఇది ఔషధంలా పని చేస్తుంది. మొలకెత్తిన పెసలు, శనగల్లో, అలాగే ఆకుకూరలు, చేప, గుడ్లు వంటివాటిలో విటమిన్‌ కె పుష్కలంగా ఉంటుంది. వీటిని దైనందిన ఆహారంలో చేర్చుకుంటే చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్