వన్నెలీనే చర్మానికి బీట్‌రూట్‌!

బీట్‌రూట్‌ని తింటే ఎన్ని పోషకాలు అందుతాయో.... దీన్ని చర్మ, కేశ సంరక్షణకు వాడినా అన్నే ఫలితాలు ఉంటాయి.

Published : 30 Nov 2022 00:43 IST

బీట్‌రూట్‌ని తింటే ఎన్ని పోషకాలు అందుతాయో.... దీన్ని చర్మ, కేశ సంరక్షణకు వాడినా అన్నే ఫలితాలు ఉంటాయి. మరి దీన్ని ఎలా వాడాలో తెలుసా?

* టేబుల్‌ స్పూన్‌ బియ్యప్పిండిలో, చెంచా ఆపిల్‌ గుజ్జు, రెండు చెంచాల బీట్‌రూట్‌ రసం, చెంచా నువ్వుల నూనె వేసి పేస్ట్‌లా కలపాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగు పెట్టుకుంటే... మృతకణాలు తొలగి చర్మం నిగనిగలాడుతుంది.

* పావుకప్పు పెరుగులో చెంచా బీట్‌రూట్‌ రసాన్ని కలిపి బాగా గిలకొట్టాలి. ఇందులో పావుకప్పు ముల్తానీ మట్టి వేసి...మరోసారి కలపాలి. దీన్ని మెడ, చేతులకు రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జిడ్డుతత్వం తగ్గి.. మెరిసిపోతుంది. బీట్‌రూట్‌లోని సిలికాన్‌ ఖనిజం చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది.

* ముఖంపై మచ్చలు కాంతివిహీనంగా కనిపించేలా చేస్తున్నాయా? కాసిన్ని బీట్‌రూట్‌ముక్కలు, చెంచా తేనె, అరచెంచా నిమ్మరసం, కాస్త పాలపొడి కలిపి...ముఖానికి పూత వేయండి. ఇలా కొన్ని రోజులు చేస్తే సమస్య దూరమవుతుంది. చర్మం వన్నెలీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్