ధగధగల దారపు గాజులు

మగువల దగ్గర ఎన్ని రకాల నగలున్నా...గాజులపై మోజు ప్రత్యేకం. బంగారం, వెండి, రబ్బరు, మట్టి... వంటివాటితో చేసినవి ఏవైనా అమ్మాయిలకు అపురూపమే.

Published : 30 Nov 2022 00:43 IST

మగువల దగ్గర ఎన్ని రకాల నగలున్నా...గాజులపై మోజు ప్రత్యేకం. బంగారం, వెండి, రబ్బరు, మట్టి... వంటివాటితో చేసినవి ఏవైనా అమ్మాయిలకు అపురూపమే. అందుకే ఎప్పటికప్పుడు కొత్త హంగులద్దుకుని మార్కెట్లోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు వారి మనసుని మెప్పించడానికి సిల్క్‌ త్రెడ్‌పై కుందన్‌ డిజైన్లతో అచ్చం రాళ్ల నగలను తలపించేలా తీర్చిదిద్దిన గాజులు సందడి చేస్తున్నాయి. ఎంబ్రాయిడరీ దుస్తులూ, పట్టు చీరలూ, పరికిణీలకు ఎంచక్కా నప్పేస్తాయి. వివాహాది శుభాకార్యాల్లో...వెలుగు జిలుగులీనుతూ ఆడపిల్లల చేతులపై ఇవి నాట్యమాడుతుంటే చూసి తీరాల్సిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్