పొడవుగా కనిపించాలంటే..

ఎత్తు తక్కువగా ఉన్నవారు చీరలు, వాటిపై ఆభరణాలను ఎంపిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఒంటికి చీర ఇట్టే నప్పినట్లు అనిపించే డిజైన్లను ఎంచుకొంటే చీరకట్టు మరింత పొడవుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది.

Updated : 01 Dec 2022 05:50 IST

ఎత్తు తక్కువగా ఉన్నవారు చీరలు, వాటిపై ఆభరణాలను ఎంపిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.

ఒంటికి చీర ఇట్టే నప్పినట్లు అనిపించే డిజైన్లను ఎంచుకొంటే చీరకట్టు మరింత పొడవుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది. మృదువైన సిల్కు ప్లెయిన్‌ చీరకు చిన్న అంచు ఉండాలి. ఇది ఎత్తు తక్కువగా కనిపించేలా చేయదు. దీనిపై చిన్నా, పెద్దా కాకుండా మధ్యస్థ పరిమాణంలో ఉండే పూల డిజైన్స్‌ బ్లవుజు చక్కటి మ్యాచింగ్‌ అవుతుంది. ఒకే వర్ణంలో చీరను ఎంచుకొనేటప్పుడు కాంట్రాస్ట్‌ కలర్‌లో గడులు, ఎంబ్రాయిడరీ తరహాలో లాంగ్‌ బ్లవుజు ఎంపిక సరైనది. ప్లెయిన్‌ సిల్కు చీరపై స్లీవ్‌లెస్‌ బ్లవుజు మ్యాచింగ్‌గా ఉంటుంది. స్టెప్స్‌ లేకుండా పైటను సింగిల్‌గా పిన్‌చేయడంతోపాటు కొంచెం పెద్దగా పైట ఉంటే పొడవుగా కనిపించొచ్చు.

ఎంబ్రాయిడరీతో ప్లెయిన్‌ ముదురు వర్ణం చీర ఎంపిక బాగుంటుంది. దీనిపై అదే రంగులో పొడవు చేతుల లాంగ్‌ బ్లవుజు, నడుం చుట్టూ మెటల్‌ బెల్ట్‌ ఉంటే కొత్తగా కనిపిస్తారు. అలాగే రఫెల్స్‌ ఉన్న లేత వర్ణం చీరలపై పొట్టి చేతుల బ్లవుజు కూడా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. అంచులున్న చీరపై ఆసక్తి ఉంటే చిన్న అంచులున్నవాటికే పెద్దపీట వేయాలి. స్లీవ్‌లెస్‌ బ్లవుజు, లేదా పొడవైన చేతులుండేలా వీటిపై ధరించొచ్చు. దగ్గరగా చిన్న ప్రింట్స్‌ ఉన్నవాటిని ధరించాలి. పైట పొడవుగా ఉండి, చీర కింది అంచులు నేలకు తగిలేలా ఉండాలి. ఇది పొడవుగా అనిపించే లుక్‌ తెచ్చిపెడుతుంది. బ్లవుజులో డీప్‌ నెక్‌కు ప్రాముఖ్యతనివ్వాలి. పొడవు లేదా ఎల్‌బో స్లీవ్స్‌ బాగుంటాయి. దీంతోపాటు చీరపై హెవీ ఎంబ్రయిడరీ, బీడ్స్‌ వర్క్‌ ఉన్నట్లైతే, దానిపై బ్లవుజు కొంచెం సింపుల్‌గా ఉండాలి. అలాగే బ్లవుజుపై వర్క్‌ ఎక్కువ ఉంటే చీర సింపుల్‌గా కనిపించాలి.

నగలు..

పైటపైకి వచ్చేలా నక్లెస్‌, పెద్ద డాలర్‌తో సింపుల్‌గా పొడవైన హారాలు బాగుంటాయి.  పొడవైన లోలాకులు ధరించాలనుకుంటే మెడలో ఆభరణం లేకుంటేనే బాగుంటుంది. అప్పుడు మెడ ప్లెయిన్‌గా అనిపించి పొడవుగా కనిపిస్తారు.  శిరోజాలు వదులుగా ఉన్నప్పుడు స్ట్రెయిట్‌నింగ్‌ నప్పుతుంది. మెడలో పొడవైన హారం చూడముచ్చటగా ఉంటుంది.

దూరంగా..

లంగాఓణీ తరహాలో పెద్దపెద్ద పూలు, డిజైన్లున్న చీరల జోలికి వెళ్లొద్దు. బ్లవుజుల ఎంపికలో పెద్దడిజైన్లున్న వాటికి దూరంగా ఉండాలి. పెద్దపెద్ద బోర్డర్లున్న చీరలను ఎంపిక చేయకూడదు. చీరపై దూరం దూరంగా పెద్దపెద్ద ప్రింట్స్‌ ఉన్నవాటిని ఎంచుకోకూడదు. ఇది శరీరసౌష్టవాన్ని పొట్టిగా కనిపించేలా చేస్తుంది. పొడవు తక్కువగా ఉండేలా పైట ఉండకూడదు. చీర కింది అంచులు పాదాలపైకి ఉండేలా చీరకట్టు ఉంటే మరింత పొట్టిగా అనిపించొచ్చు. చీర, బ్లవుజూ రెండూ హెవీ వర్క్‌ ఉండకూడదు. ఏదైనా ఒకటి మాత్రమే హెవీగా కనిపించాలి. నెక్‌ విషయానికొస్తే హైనెక్‌, క్లోజ్‌ నెక్‌లకు దూరంగా ఉండాలి. మెడవద్ద కుదించినట్లుగా కనిపించే ప్రమాదం ఉండి, మరింత పొట్టిగా అనిపిస్తారు. చోకర్‌ ఎంపికకు వీలైనంత దూరంగా ఉండాలి. చెవులకు పెద్ద దుద్దులు, చిన్నచిన్న హ్యాంగింగ్స్‌ అలంకరణ ప్రత్యేకంగా కనిపించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్