చర్మ ఆరోగ్యానికి.. స్కిన్‌ సైక్లింగ్‌!

ముప్పై ఏళ్లు వచ్చేసరికే ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు. అందుకే ముందు నుంచీ చర్మంపై దృష్టిపెడుతున్న వారెందరో! ఫలితమే కచ్చితమైన స్కిన్‌ కేర్‌ రొటీన్‌ వగైరా! మరి ఫలితం దక్కుతోందా? ఈ ప్రశ్నకే సరైన సమాధానం దొరకదు.

Updated : 01 Dec 2022 05:58 IST

ముప్పై ఏళ్లు వచ్చేసరికే ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు. అందుకే ముందు నుంచీ చర్మంపై దృష్టిపెడుతున్న వారెందరో! ఫలితమే కచ్చితమైన స్కిన్‌ కేర్‌ రొటీన్‌ వగైరా! మరి ఫలితం దక్కుతోందా? ఈ ప్రశ్నకే సరైన సమాధానం దొరకదు. అందుకే.. రోజూ క్రీములను రాస్తూ పోవడం కాదు... స్కిన్‌ సైక్లింగ్‌ను అనుసరించాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏమిటిది?

స్కిన్‌ కేర్‌ రొటీన్‌ అంటే ఏంటి.. ఒక పద్ధతిలో తగిన క్రీములను రాస్తూ వెళ్లడం కదా! వాటికి ‘విశ్రాంతి దినాలు’ చేర్చడమే స్కిన్‌ సైక్లింగ్‌. దీనివల్ల చర్మం తనంతట తానే రిపేర్‌ చేసుకోవడమే కాదు.. మెరుగైన ఫలితాల్నీ పొందుతుందట. అయితే ఇది రాత్రిపూట ఉపయోగించే ప్రక్రియ మాత్రమే! దీనిలో మూడు దశలుంటాయి.

1. ఎక్స్‌ఫోలియేషన్‌.. చర్మతీరుకు తగిన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నచ్చిన స్క్రబ్‌ను ఎంచుకొని అయిదు నిమిషాలపాటు ముఖాన్ని రుద్దాలి. ముఖాన్ని నీటితో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిపోయాక మాయిశ్చరైజర్‌ రాస్తే సరి. చర్మంలోని మృతకణాలే కాదు.. పేరుకున్న అవశేషాలూ తొలగిపోతాయి.

2. రెటినాయిడ్స్‌.. రెండో రోజు ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొని తడిపూర్తిగా పోయేదాకా ఆగాలి. ఆపై విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే రెటినాయిడ్‌ సీరమ్‌ లేదా క్రీమ్‌ రాయాలి. మొదటిసారి రాసేవారికి చర్మం ఎర్రబడటం, సన్నటి మొటిమలూ రావొచ్చు. అలాంటప్పుడు కాస్త మాయిశ్చరైజర్‌ రాస్తే సరిపోతుంది. ఇది మొటిమల తాలూకు మచ్చలు, ముడతలు, గీతలు వంటివాటినన్నింటినీ తొలగిస్తుంది.

* రికవరీ.. మూడు, నాలుగు రోజులను ఇలా పిలుస్తాం. ఈ రెండు రోజులూ ముఖాన్ని శుభ్రం చేశాక కేవలం మాయిశ్చరైజర్‌నే రాస్తాం. ఇది చర్మానికి తేమతోపాటు పోషణనీ ఇస్తుంది.

తర్వాత ఈ సైకిల్‌ను తిరిగి కొనసాగిస్తే సరి! ఎంత మన్నికైన ఉత్పత్తులైనా రోజూ రాసుకుంటూ వెళితే చర్మరంధ్రాల్లో పేరుకునే అవకాశాలెక్కువ. ఫలితమే దుష్ప్రభావాలు. అలా మితి మీరొద్దనే ఈ పద్ధతి... ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ అన్నది తెలుసుగా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్