మొటిమలు తగ్గించే బొప్పాయి...

తియ్యతియ్యగా నోరూరించే బొప్పాయిలోని పోషకాలు ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తాయి.

Published : 02 Dec 2022 00:37 IST

తియ్యతియ్యగా నోరూరించే బొప్పాయిలోని పోషకాలు ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తాయి. అదెలాగంటే...

* కప్పు బొప్పాయి గుజ్జుకి పాలల్లో నానబెట్టిన ఓట్స్‌ని జతచేసి కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తే చర్మానికి తేమ అంది నిగారింపు వస్తుంది.

* పావుకప్పు బొప్పాయి గుజ్జుకి కోడిగుడ్డులోని తెల్లసొన, టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి ఓ పావుగంట ఆరనివ్వాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేసి చూడండి. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

* మొటిమల మచ్చలతో ముఖం కాంతి విహీనంగా మారినప్పుడు టేబుల్‌ స్పూన్‌ బొప్పాయి గుజ్జులో చెంచా చొప్పున తులసి పొడి, తేనె కలిపి రోజూ ఉదయాన్నే ముఖానికి రాయాలి. ఇందులో ఉండే పపైన్‌ అనే ఎంజైమ్‌ వాపుని తగ్గించి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్