చుండ్రుకు చెక్‌ పెట్టేయండి!

చలికాలం ఇబ్బంది పెట్టే సమస్యల్లో చుండ్రూ ఒకటి. మాడుపై దుమ్ము పేరుకోవడం, పొడిబారడంతోపాటు ఒత్తిడీ దీని కారకాలే. ఫలితం దురద, విపరీతంగా వెంట్రుకలు రాలడం. ఇంట్లో దొరికే పదార్థాలతోనే దీనికి చెక్‌ చెప్పేయండి.

Updated : 03 Dec 2022 04:43 IST

చలికాలం ఇబ్బంది పెట్టే సమస్యల్లో చుండ్రూ ఒకటి. మాడుపై దుమ్ము పేరుకోవడం, పొడిబారడంతోపాటు ఒత్తిడీ దీని కారకాలే. ఫలితం దురద, విపరీతంగా వెంట్రుకలు రాలడం. ఇంట్లో దొరికే పదార్థాలతోనే దీనికి చెక్‌ చెప్పేయండి.

* ఒక మగ్గులో అరకప్పు చొప్పున నీరు, ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలపాలి. షాంపూతో తలస్నానం అయ్యాక చివర్లో ఆ నీటితో మాడు నుంచి జుట్టు వరకు తడిపేయాలి. కొద్దిగా మర్దనా చేసి, పావుగంట వదిలేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. జుట్టుకు పోషణ.. డాండ్రఫ్‌ వదులుతుంది.

* పావు కప్పు కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేయండి. దానికి అరచెక్క నిమ్మరసం కలిపి తలంతా పట్టించండి. 20 నిమిషాలయ్యాక షాంపూతో కడిగేయాలి. చుండ్రు దూరమవడమే కాదు.. జుట్టూ నిగనిగలాడుతుంది.

* నారింజ తొక్కలను తీసుకొని వాటికి కొంత నిమ్మరసం కలిపి మిక్సీ పట్టండి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటివి మాడుకు అందడమే కాదు, చుండ్రూ పోతుంది.

* గుడ్డు తెలసొనకు కొద్దిగా నిమ్మరసం చేర్చి, తలంతా పట్టించాలి. ఆపై ప్లాస్టిక్‌ కవర్‌ లేదా షవర్‌ క్యాప్‌తో మూసేయాలి. అరంటయ్యాక షాంపూ చేస్తే సరిపోతుంది. తలకు తేమ అందించడంలో ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.

* బాగా మరిగించిన నీటిలో రెండు గ్రీన్‌ టీ బ్యాగులను వేసి, 20 నిమిషాలు ఉంచాలి. నీరు చల్లగా అయ్యాక తలస్నానం చేసి, ఆరిన జుట్టుకు దీన్ని పట్టించాలి. అరగంటయ్యాక చల్లని నీటితో కడిగేస్తే సరి. వారానికి రెండుసార్లు చేస్తే డాండ్రఫ్‌ వదలడమే కాదు.. కురులూ దృఢంగా అవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్