చేతులనూ పట్టించుకోండి!

చేయి తడవకుండా పనులు పూర్తవడం కష్టం మనకు! ఈ కాలం మామూలుగానే చర్మం తేమ కోల్పోతుంది.

Updated : 07 Dec 2022 04:05 IST

చేయి తడవకుండా పనులు పూర్తవడం కష్టం మనకు! ఈ కాలం మామూలుగానే చర్మం తేమ కోల్పోతుంది. ఇక ఇంటి, వంట పనుల కోసం తరచూ చేతులు కడుగుతోంటే.. పొడిబారతాయి. అందవిహీనంగా కనిపించడమే కాదు.. ఒక్కోసారి దురద, మంట వంటివీ కలుగుతాయి. కాబట్టి..

* ఈకాలం దప్పిక తక్కువ. దీంతో నీళ్లు తాగడం మానేస్తుంటాం. కానీ గుర్తుంచుకొని మరీ నీటిని తాగుతుండండి. అప్పుడే చర్మమూ తేమగా కనిపిస్తుంది. పదే పదే చేతులను నీటితో తడపక తప్పదు మనకు. ఉదయాన్నే చేతికి మాయిశ్చరైజర్‌ లేదా పెట్రోలియం జెల్లీ రాశాకే పని మొదలుపెట్టండి. చేతులు కడిగిన ప్రతిసారీ వెంటనే మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. సబ్బు ఉపయోగిస్తే.. మాయిశ్చరైజర్‌ రాయడం తప్పనిసరి.

* వీలైనంత వరకూ సబ్బుని దూరంగా ఉంచండి. దీనిలోని రసాయనాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. గిన్నెలు, దుస్తులకు తప్పక వాడాల్సి వస్తే.. చేతులకు కవరో, గ్లౌజులో వేసుకోవడం మేలు. వెట్‌ వైపులను దగ్గర ఉంచుకుంటే పదే పదే చేతులు కడగాల్సిన అవసరముండదు.

* బయటికి వెళుతున్నా బ్యాగులో హ్యాండ్‌ క్రీమ్‌ ఉంచుకోండి. విటమిన్‌ బి3 ఉన్న లోషన్‌ లేదా క్రీమ్‌లను ఎంచుకుంటే ఫలితం బాగుంటుంది. రాత్రుళ్లు పడుకోబోయే ముందు కొబ్బరి, బాదం, ఆలివ్‌ నూనెల్లో ఏదోఒకదాన్ని ఎంచుకొని గోరువెచ్చగా చేసి చేతులు, గోళ్లకు మర్దనా చేస్తే.. సరైన పోషణ అందడమే కాదు.. మృదువుగా, అందంగానూ తయారవుతాయి.

* రెండు స్పూన్ల చొప్పున ఆలివ్‌ నూనె, ఓట్స్‌, పంచదార తీసుకొని బాగా కలపాలి. లేదా రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జుకు ఒక క్యాప్సూల్‌ విటమిన్‌ ఇ ఆయిల్‌ చేర్చాలి. లేదా మిగలపండిన అరటిపండు పావుముక్క గుజ్జులా చేసి దానికి తేనె, ఆలివ్‌ ఆయిల్‌ చేర్చి బాగా కలపాలి.. వీటిల్లో నచ్చిన దాన్ని ఎంచుకొని చేతులకు పట్టించి, కొద్దిగా తడి చేసుకుంటూ 5-7 నిమిషాలు వృత్తాకారంలో స్క్రబ్‌ చేయాలి. మృతకణాలు పోయి తాజాగా కనిపిస్తాయి. ఇలా వారానికోసారి చేస్తే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్