సముద్ర కుమారి సౌందర్య రహస్యం..

పొన్నియిన్‌ సెల్వన్‌, అమ్ము చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైంది ఐశ్వర్యలక్ష్మి. అభినయంతోపాటు అందంతోనూ మెప్పిస్తోన్న తనేం చెబుతోందంటే... ‘ముఖానికి అందాన్ని తేవడంలో కళ్లు, కనుబొమలది ప్రధాన పాత్ర అని నమ్ముతా.

Updated : 08 Dec 2022 04:39 IST

పొన్నియిన్‌ సెల్వన్‌, అమ్ము చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైంది ఐశ్వర్యలక్ష్మి. అభినయంతోపాటు అందంతోనూ మెప్పిస్తోన్న తనేం చెబుతోందంటే... ‘ముఖానికి అందాన్ని తేవడంలో కళ్లు, కనుబొమలది ప్రధాన పాత్ర అని నమ్ముతా. తీరైన కనుబొమల కోసం త్రెడింగ్‌ చేయను. ట్వీజర్‌తో అతిగా ఉన్న వెంట్రుకలను మాత్రం తొలగిస్తానంతే! ప్రతి వారం ఒంటికి గోరువెచ్చని నూనెను పట్టించి మర్దనా చేసుకుంటా. షూటింగ్‌ లేని సమయాల్లో తక్కువ మేకప్‌ వాడతా. మేకప్‌ తొలగించనిదే నిద్రపోను. సన్‌స్క్రీన్‌ లోషన్‌ లేకుండా అడుగు బయటపెట్టను. పైపై మెరుగులు కాదు.. ఆరోగ్యవంతమైన చర్మం నా లక్ష్యం. అందుకే ఉదయాల్ని 3-4 గ్లాసుల వేడినీటితో ప్రారంభిస్తా. ఉడికించిన గుడ్లు, పండ్లను అల్పాహారంగా తీసుకుంటా. ఇంట్లో చేసిన ఆహారానికే నా ప్రాధాన్యం. అలాగని నోరు కట్టేసుకొని ఉండను. షూటింగ్‌ల నుంచి ఖాళీ దొరికితే అదిక ‘చీటింగ్‌ డే’నే! నచ్చిన పిజ్జా, ఐస్‌క్రీమ్‌ అన్నీ లాగించేస్తా.. అయితే పరిమితంగానే! రోజూ యోగా, వర్కవుట్స్‌, స్పిన్నింగ్‌.. ఇలా నచ్చిన వ్యాయామం తప్పకుండా చేస్తా. జంక్‌ఫుడ్‌ తీసుకున్నప్పుడు ఇంకో అరగంట ఎక్కువ శ్రమిస్తా. మనసు ఆనందంగా ఉంటేనే అది కళ్లలోనూ, నవ్వులోనూ కనిపిస్తుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా నచ్చిన ప్రదేశాలకు వెళ్తా. నా పెంపుడు జంతువుతో ఆడతా. డ్యాన్స్‌ గురించి చెప్పక్కర్లేదు.. ఇది అదనంగా శరీరాన్నీ ఫిట్‌గా ఉంచుతుంది’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్