అందానికో టీ!

చల్లని వాతావరణం.. చేతిలో వేడిగా టీ.. గొంతు నుంచి జారుతోంటే ప్రాణం ఎక్కడికో వెళ్లిపోతున్నట్టు ఉంటుంది కదా! అందుకే ఎక్కువసార్లు తాగేస్తుంటాం. స్తబ్దతను పోగొట్టే టీ సౌందర్యాన్నీ పెంచుతుంది తెలుసా?...

Updated : 09 Dec 2022 04:18 IST

చల్లని వాతావరణం.. చేతిలో వేడిగా టీ.. గొంతు నుంచి జారుతోంటే ప్రాణం ఎక్కడికో వెళ్లిపోతున్నట్టు ఉంటుంది కదా! అందుకే ఎక్కువసార్లు తాగేస్తుంటాం. స్తబ్దతను పోగొట్టే టీ సౌందర్యాన్నీ పెంచుతుంది తెలుసా?

మల్లె.. ఈ టీలోని సహజ నూనెలు పిగ్మెంటేషన్‌ను తగ్గించి, ముఖంపై గీతలు ఏర్పడకుండానూ చూస్తాయి. తరచూ తీసుకుంటోంటే ముఖం తాజాగా కనిపించడమే కాదు.. ఆరోగ్యంగా నిగనిగ లాడుతుంది కూడా.


పెప్పర్‌మింట్‌..  పుదీనా వాసనతో నోటికి తాజాదనాన్ని అందించే ఈ టీ చర్మంపై మ్యాజిక్‌ చేయగలదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు డి, ఇ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. యాక్నేకి వ్యతిరేకంగానూ పోరాడుతూనే చర్మంలో తగినంత నూనెలు విడుదలయ్యేలా చేసి, సహజ మెరుపునిస్తాయి.


చామంతి.. మెరిసే చర్మం కావాలంటే ఈ టీని ఎంచుకోండి. దీన్లో మెదడుకు విశ్రాంతినిచ్చే గుణాలెక్కువ. యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. అవి చర్మం, కురులకు పోషణనిచ్చి, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. దీనిలోని పాలీఫినాల్స్‌, ఫైటోకెమికల్స్‌.. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, చర్మాన్ని లోపల్నుంచీ మరమ్మతు చేస్తాయి.


పసుపు... దీనిలోని కర్క్యుమిన్‌ మెరుపుతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు యాక్నేను రానివ్వవు. చర్మ రంధ్రాలను చిన్నగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.


గ్రీన్‌.. ఔషధ గుణాలెక్కువ. శరీరాన్ని డీటాక్సిఫై చేసి, రోగ నిరోధకతను పెంచుతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని దరి చేరనివ్వవు. ముఖానికి తేమనీ ఇస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్