తులసితో తళుక్కున మెరిసె

ప్రతి ఇంటా సులువుగా పెరిగే తులసిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు... అందానికీ మేలు చేస్తాయి అని చెబుతోంది ఆయుర్వేదం.

Updated : 14 Dec 2022 02:49 IST

ప్రతి ఇంటా సులువుగా పెరిగే తులసిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు... అందానికీ మేలు చేస్తాయి అని చెబుతోంది ఆయుర్వేదం.

* తులసిలో శక్తిమంతమైన యాంటీమైక్రోబియల్‌ గుణాలు.. చర్మవ్యాధులూ, సమస్యలను నయం చేస్తాయి. ఓ మూడు నాలుగు చొప్పున తులసి, వేప ఆకుల్ని తీసుకుని కాసేపు నీళ్లల్లో నానబెట్టాలి. ఆ నీటికి చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే చాలు. ఇలా ఓ వారం చేసి చూడండి ఫలితం కనిపిస్తుంది.

* రాగి చెంబులో నీళ్లు పోసి గుప్పెడు తులసి ఆకులూ, కాసిన్ని గులాబీ రేకలూ వేసి నాననివ్వాలి. రెండు గంటల తర్వాత ఈ నీళ్లను వడకట్టి వాటిని ముఖాన్ని శుభ్రపరిచే యాస్ట్రిజెంట్‌గా వాడుకోవచ్చు.

* చెంచా తులసి ఆకుల పేస్ట్‌కి పాలల్లో నానబెట్టిన చెంచా ఓట్‌మీల్‌, చెంచా తేనె, రెండు చెంచాల బ్రౌన్‌ షుగర్‌ కలిపి ముఖానికి రాసి నలుగులా రుద్దండి. ఇలా ఓ పదినిమిషాలైనా చేస్తే... మృతకణాలు తగ్గుతాయి. ముఖంపై మొటిమల మచ్చలూ మాయమవుతాయి. చర్మం కాంతిమంతంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్