మోముకి మేలు.. బ్రౌన్‌షుగర్‌

మోము మెరిసిపోవాలని ఎన్నెన్నో క్రీములు కొంటుంటాం. వాటికి బదులు ఈ సారి వంటింట్లో ఉండే బ్రౌన్‌ షుగర్‌ని వాడి చూడండి.

Updated : 15 Dec 2022 02:50 IST

మోము మెరిసిపోవాలని ఎన్నెన్నో క్రీములు కొంటుంటాం. వాటికి బదులు ఈ సారి వంటింట్లో ఉండే బ్రౌన్‌ షుగర్‌ని వాడి చూడండి.

స్క్రబ్‌ చేస్తే... సాధారణంగా బ్రౌన్‌షుగర్‌ని చర్మం మృదువుగా మారేందుకు స్క్రబ్‌లా వాడుతుంటాం. ఇందులో గ్లైకాలిక్‌ యాసిడ్‌, కొద్ది మొత్తంలో హైడ్రాక్సీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మం లోపలకి చొచ్చుకెళ్లి శుభ్రపరుస్తాయి. మృతకణాలను తొలగిస్తాయి. కొత్త కణాల ఉత్పత్తికి సాయపడతాయి. పావుకప్పు పెసర పిండిలో రెండు చెంచాల బ్రౌన్‌ షుగర్‌, కొద్దిగా కొబ్బరి పాలు చేర్చి కలపాలి. ఈ మిశ్రమంతో నలుగు పెట్టు కోవాలి. ఇలా వారానికి 2,3 సార్లైనా చేస్తే మేలు.

కళ తెచ్చేందుకు... ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడానికి తగిన సమయం లేదనుకునే వారు... టొమాటో ముక్కకు బ్రౌన్‌షుగర్‌ని అద్ది రుద్దుకోవాలి. ఇలా రెండు మూడు నిమిషాలు సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా చేస్తే చాలు. నీటితో శుభ్రం చేసుకుని చూస్తే... టాన్‌ తగ్గి చర్మం వన్నెలీనుతుంది.

మచ్చలు తొలగిస్తుంది... బ్రౌన్‌షుగర్‌ చర్మ ఛాయని మెరుగు పరుస్తుంది. మచ్చలు పోయేలా చేస్తుంది. నువ్వుల నూనెలో చెంచా బ్రౌన్‌షుగర్‌ని కలిపి రాసుకోవాలి. ఆపై మృదువుగా కనీసం పది నిమిషాలైనా రుద్దాలి. ఇలా ఓ 15 రోజులు క్రమం తప్పక చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు కూడా తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్