ఊలు దుస్తులను..

చలి నుంచి తప్పించుకు నేందుకు రక్షణ కవచంలా ఉపయోగపడే ఊలు దుస్తుల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు నిపుణులు.

Updated : 16 Dec 2022 01:11 IST

చలి నుంచి తప్పించుకు నేందుకు రక్షణ కవచంలా ఉపయోగపడే ఊలు దుస్తుల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు నిపుణులు.

శీతకాలంలో మాత్రమే వాడే స్వెట్టర్లు, షాల్స్‌ వంటి వాటిని మిగిలిన రోజుల్లో కప్‌బోర్డులో ఉంచుతాం. దాదాపు ఆరేడు నెలలు ఒకేచోట ఉండటంతో వీటి నుంచి దుర్వాసన వస్తుంది. కంటికి కనబడని బ్యాక్టీరియా ఊలు పోగుల్లో చేరే ప్రమాదమూ ఉంటుంది. వీటిని అలాగే ధరిస్తే దురద, ఎలర్జీ వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే స్వెట్టర్ల వాడకం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఓ అరగంట ఎండలో ఆరనిచ్చి, మృదువుగా బ్రష్‌ చేసి దులిపితే వీటిపై చేరిన చిన్నచిన్న పురుగులు పోతాయి. వీటి నుంచి వచ్చే వాసనను దూరం చేయాలంటే మెత్తని కాటన్‌ వస్త్రంలో రెండు చెంచాల వంట సోడా లేదా కాఫీ పౌడర్‌ మూట కట్టి మడతల మధ్య ఉంచాలి. ఆరేడు గంటల తర్వాత దుర్వాసన దూరమవుతుంది. స్వెటర్లను ధరించి తీసిన తర్వాత హ్యాంగర్లకు తగిలించద్దు. అలా చేస్తే సాగిపోయి వదులుగా అవుతాయి.

ఆయిల్‌తో.. స్వెట్టర్లను వేసుకొనే ముందు ఒకసారి ఉతకాలి. మిగతా దుస్తులతో కలిపి వీటిని వాషింగ్‌ మిషన్‌లో వేస్తే ఊలు పాడవడం, పీచులా రావడం, వదులై సాగిపోవడం జరిగే ప్రమాదం ఉంది. వీటిని ప్రత్యేకంగా మిషన్‌లో ఊలు దుస్తుల ఆప్షన్‌ వాడుతూ తక్కువసేపు ఉతకాలి. చివరిసారి వాష్‌ అయ్యేటప్పుడు ఆ నీటిలో నాలుగు చుక్కల ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ కలిపితే, దుస్తుల నుంచి మంచి పరిమళం వస్తుంది. పావు కప్పు నిమ్మరసం కలిపిన బకెట్‌ నీళ్లల్లో ఊలు దుస్తులను ముంచి ఆరబెట్టినా చాలు. దుర్వాసన పోయి, మంచి వాసన వస్తుంది. ఊలు దుస్తుల మీద కాఫీ లేదా టీ మరకలు పడితే... గోరువెచ్చని నీటిలో మైల్డ్‌ క్లెన్సర్‌ను కలిపిన మిశ్రమంతో ఉతకాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్