అందానికి... సుగంధ తైలాలు

చర్మ, కేశ సంరక్షణ ఉత్పతులు అన్నింటిలోనూ... ఈ మధ్య ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వాడకం పెరిగింది. మరి వీటిని మనమెలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి.

Updated : 17 Dec 2022 01:25 IST

చర్మ, కేశ సంరక్షణ ఉత్పతులు అన్నింటిలోనూ... ఈ మధ్య ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వాడకం పెరిగింది. మరి వీటిని మనమెలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి.

* ఎసెన్షియల్‌ నూనెల్ని పెద్ద మొత్తంలో కానీ, నేరుగా కానీ రాసుకో కూడదు. వాటిని కచ్చితంగా బాదం, కొబ్బరి, ఆలివ్‌, నువ్వుల నూనె వంటి వాటిల్లో  రెండో, మూడో చుక్కల్ని కలిపి మాత్రమే వాడాలి. నిమ్మగడ్డి, మల్లె, చామంతి, గులాబీ, లావెండర్‌, జొజోబా వంటివాటిని ప్రత్యేక పద్ధతుల్లో వేడిచేసి నూనెను తీస్తారు. ఇవేకాదు...వీటిల్లో మరెన్నో రకాలూ అందుబాటులో ఉన్నాయి. వీటినే సుగంధ లేదా అరోమా నూనెలనీ అంటారు.

* లావెండర్‌, గులాబీ, మల్లె పూలతో చేసిన ఈ సుగంధ తైలాలు ముఖమ్మీది మచ్చలను తొలగిస్తాయి. జుట్టుని ఒత్తుగా మారుస్తాయి. ఇందుకోసం బాదం నూనెలో రెండు చుక్కల ఏదైనా సుగుంధ తైలాన్ని కలిపి తలకీ, ఒంటికీ పట్టించాలి. అరగంటాగి ఆవిరి పట్టి గాఢత తక్కువ ఉండే షాంపూ/సబ్బుతో తలస్నానం చేస్తే సరి. జుట్టు మెరిసిపోతుంది.

* ఈ తైలాలకు బ్యాక్టీరియాతో పోరాడే గుణం ఉంది. కప్పు బాదం నూనెలో రెండు మూడు చక్కల అరోమా నూనె కలిపి... దానికి చెంచా పెసరపిండి, కప్పు పాలు పోసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా పెట్టుకుంటే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. టాన్‌ తగ్గుతుంది. మేను వన్నెలీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్