షేడ్‌ మారిందా?

కాలం మారినా, పర్యటనలకు వెళ్లినా చర్మరంగులో మార్పు సహజమే. తీరా ఏ వేడుకకో సిద్ధమవుతుంటామా.. ఫౌండేషన్‌ చర్మరంగుతో సరిపోలదు.

Updated : 19 Dec 2022 06:44 IST

కాలం మారినా, పర్యటనలకు వెళ్లినా చర్మరంగులో మార్పు సహజమే. తీరా ఏ వేడుకకో సిద్ధమవుతుంటామా.. ఫౌండేషన్‌ చర్మరంగుతో సరిపోలదు. కొత్తది కొని తెచ్చుకునే సమయముంటే సరే! లేకపోతే? కంగారక్కర్లేదు. ఫౌండేషన్‌ యథావిధిగా రాసేయండి. చర్మరంగు కంటే ఫౌండేషన్‌ డార్క్‌గా ఉంటే.. తేలిక రంగు కన్సీలర్‌లను కళ్లకింద, గడ్డం, బుగ్గలు, నుదుటిపై రాసి, ముఖమంతా విస్తరించేలా చేస్తే సరి. అదే ఫౌండేషన్‌ లేతరంగులో కనిపిస్తోంటే.. బ్రాంజింగ్‌ స్టిక్‌తో నుదురు, బుగ్గలు, గడ్డం ప్రాంతంలో రాసి, మొత్తం బ్లెండ్‌ అయ్యేలా చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్