ముఖానికి ‘డోనట్‌’!

డోనట్‌ని ముఖానికి పూయాలేమోనని కంగారొద్దు. ఈ ఏడాది ఎక్కువమంది అనుసరించిన వాటిల్లో డోనట్‌ ట్రెండ్‌ ఒకటి.

Updated : 20 Dec 2022 03:27 IST

2022 ట్రెండ్‌

డోనట్‌ని ముఖానికి పూయాలేమోనని కంగారొద్దు. ఈ ఏడాది ఎక్కువమంది అనుసరించిన వాటిల్లో డోనట్‌ ట్రెండ్‌ ఒకటి. అంటే.. డోనట్‌ తరహా మృదువైన, మెరిసే చర్మాన్ని పొందడం. ఎలాగంటారా.. ఇదిగో ఇలా!

* గాఢత తక్కువున్న ఫోమ్‌ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేయాలి. డబుల్‌ క్లెన్సింగ్‌ చేశాక కాస్త తడిగా ఉన్నప్పుడే చర్మతీరుకు తగ్గ స్క్రబ్‌తో అయిదు నిమిషాలు ముఖమంతా వృత్తాకారంలో రుద్దాలి. సహజ కాంతి రావాలంటే ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు, మేకప్‌, దుమ్మూధూళి అవశేషాలు పోగొట్టాలన్నది దీని ఉద్దేశం.

* ఇప్పుడు ఆల్కహాల్‌ లేని టోనర్‌ను వేళ్లపై వేసుకొని ముఖమంతా అద్దడమో, కాటన్‌పై వేసి తుడవడమో చేయాలి. ఇది చర్మ కణాల్లోకి చొచ్చుకొని పోయి, వాటిని తాజాగా చేస్తుంది. టోనర్‌ ఇంకింది అనుకున్నాక హైడ్రేటింగ్‌ సీరమ్‌ను రాయాలి. దానిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఎ, ఇ, డి విటమిన్లు ఉండేలా చూసుకుంటే మంచిది.

* ఆపై తేమ ఎక్కువగా ఉండే మాయిశ్చరైజర్‌ పూయాలి. ఇది ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫేస్‌ ఆయిల్‌ 2-3 చుక్కలు తీసుకొని ముఖమంతా పట్టించేయండి. ఇది పోషకాలు చర్మకణాలకు అందేలా చేయడమే కాదు.. జిడ్డు చర్మం, మొటిమల సమస్య ఉన్నవారికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందట.

* పగలు, రాత్రి రెండు పూటలూ దీన్ని ప్రయత్నించొచ్చు. వేడుకల్లాంటివి ఉంటే ఫేస్‌ ఆయిల్‌ రాశాక ఎస్‌పీఎఫ్‌ ఉన్న బీబీ క్రీమ్‌ కొద్దిగా రాస్తే చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే స్క్రబ్‌ని రోజూ చేయాల్సిన పనిలేదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది. డోనట్‌లా మెరిసిపోవడానికి సిద్ధమేనా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్