గోళ్లకి క్రిస్మస్‌ కళ!

క్రిస్మస్‌ వచ్చేస్తోంది. ఈ పండగ అనగానే మనకు గుర్తొచ్చేవి గ్లిటర్‌, మంచు, శాంటా, క్యాండీస్‌ వగైరా కదా! వాటిని గోళ్ల మీదకి ఎక్కించేసెయ్యండి.

Updated : 21 Dec 2022 04:59 IST

క్రిస్మస్‌ వచ్చేస్తోంది. ఈ పండగ అనగానే మనకు గుర్తొచ్చేవి గ్లిటర్‌, మంచు, శాంటా, క్యాండీస్‌ వగైరా కదా! వాటిని గోళ్ల మీదకి ఎక్కించేసెయ్యండి. కాస్త సృజనాత్మకతను ఉపయోగిస్తే... ఇలా ఎన్ని మెరుగులు దిద్దుకోవచ్చో!


ఒకదానికి మినహా అన్ని గోళ్లకూ టొమాటో ఎరుపు రంగు వేసేయండి. మిగిలిన దానికి తెలుపు వేసి, రెయిన్‌డీర్‌ని గీస్తే సరి! కళ్ల కోసం రెండు నలుపు చుక్కలు, పెద్ద ఎర్రముక్కు, రెండు నలుపు రంగులో కొమ్ములు గీస్తే సరిపోతుంది.


బ్లూ, తెలుపు లేదా హాఫ్‌ వైట్‌ రంగు ఒక్కో వేలికి మార్చి వేస్తూ వెళ్లండి. బ్లూ దానిపై తెలుపు రంగులో చుక్కలు, స్నోఫ్లేక్స్‌తో నింపేయండి. తెలుపు దానిపై బంగారు రంగు మెరుపులను చల్లి దానిపై ట్రాన్‌స్పరెంట్‌ నెయిల్‌ పాలిష్‌ ఒక కోట్‌ వేసి చూడండి.. ఫ్రోజెన్‌ థీమ్‌లా బాగుంటుంది.


క్రిస్మస్‌ చెట్టుకి అందాన్నిచ్చేది రంగు రంగుల బంతుల్లాంటి డెకరేషన్స్‌.. అవునా? వాటినీ గోళ్లపై ప్రయత్నించేయచ్చు. మొదట ట్రాన్‌స్పరెంట్‌ నెయిల్‌ పాలిష్‌ పూయండి. గోరుచివర్లో గుండ్రంగా నలుపుతో గీసి, దానిలో నచ్చిన రంగు వేసి దానిపై తెలుపు రంగు గీతలు గీయాలి. ఫొటోలో చూపినట్టు ఒక్కోవేలికీ ఒక్కో రంగుతో వేస్తే సరిపోతుంది.


అన్నీ చేసి శాంటాక్లాజ్‌ లేకపోతే ఎలా? ఆయన్నీ గోళ్లపై దింపేయండి.. సులువే! గోళ్ల చివర్లకు గీతలా తెలుపు రంగు వేయండి. దానిపై స్నోమ్యాన్‌ గీసి స్కార్ఫ్‌, టోపీగా ఎరుపు రంగు, బటన్స్‌, కళ్లు, చేతులకు నలుపు రంగు వేస్తే శాంటా పూర్తయినట్లే. మరో వేలికీ ఇలాగే చేయండి. మిగిలినవాటికి తెలుపు రంగులో సన్న చుక్కలు పెడితే చాలు. సులువే.. కదూ! ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్