తలకి నూనె పెడుతున్నారా?

మారిన జీవనశైలి, పోషకలేమి, అశ్రద్ధ వంటి కారణాలతో... జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతోంది. మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే....

Published : 10 Jan 2023 00:06 IST

మారిన జీవనశైలి, పోషకలేమి, అశ్రద్ధ వంటి కారణాలతో... జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతోంది. మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే....

* జిడ్డు కారుతుందనీ, ముఖం కళ తప్పుతుందనీ... కొందరు జుట్టుకి అసలు నూనె పెట్టరు. ఇంకొందరేమో వారంలో ఆరేడు రోజులు నూనె తలతోనే ఉంటారు. ఇంతకీ జుట్టుకి ఏది మంచిది? అన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఈ రెండూ తప్పే అంటారు సౌందర్య నిపుణులు. జుట్టుకి పోషణ అందాలన్నా, అవి పొడిబారి నిర్జీవంగా మారకూడదన్నా... రెండు రోజులకోసారైనా నూనె పెట్టాలి. తర్వాత జిడ్డు తలతో బయటకి వెళ్లడం మంచిది కాదు. ఓ గంట తర్వాత తప్పక తల స్నానం చేయాలి. అప్పుడే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

* తలస్నానం చేశాక జుట్టుని డ్రయ్యర్లతో ఆరబెడుతున్నారా? ఇక మీదట ఆ పని చేయకండి. వేడి వల్ల... వెంట్రుకలు చిట్లి పాడవుతాయి. తడి తలపై మెత్తటి తువాలుతో ఒత్తాలే కానీ, బలవంతంగా రుద్దడం, దులపడం వంటివీ చేయొద్దు. ఇవన్నీ జుట్టుని బలహీన పరిచేవే.

* చాలామంది జుట్టుని తరచూ గాలికి వదిలేస్తారు, చిక్కులు తీయరు. కాస్త వదులుగా అయినా అల్లుకుంటే పాడవదు. అలానే దువ్వెన నాణ్యంగా ఉండేలా చూసుకోవడమూ తప్పని సరి. అదీ పూర్తిగా తడి ఆరాకనే దువ్వాలి. తర్వాతే జడ వేసుకోవాలి. లేదంటే చుండ్రు ఇబ్బంది పెడుతుంది. జుట్టు రాలే సమస్యా ఎక్కువవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్