నలుగు పెట్టేయండి!

సంక్రాంతికి ఇంట్లో అందరూ ఉదయాన్నే నలుగు పెట్టుకొని స్నానం చేయడం ఆనవాయితీ! క్లెన్సింగ్‌, స్క్రబింగ్‌లనే ఈతరం అమ్మాయిలకు ‘నలుగు’ పాత కాలం పద్ధతిలా అనిపించొచ్చు.

Published : 13 Jan 2023 01:16 IST

సంక్రాంతికి ఇంట్లో అందరూ ఉదయాన్నే నలుగు పెట్టుకొని స్నానం చేయడం ఆనవాయితీ! క్లెన్సింగ్‌, స్క్రబింగ్‌లనే ఈతరం అమ్మాయిలకు ‘నలుగు’ పాత కాలం పద్ధతిలా అనిపించొచ్చు. కానీ దాని వల్ల లాభాలు తెలిస్తే మాత్రం ఆ మాట అనరిక!

* బాదం, కొబ్బరి నూనెల్లో నచ్చింది తీసుకొని గోరు వెచ్చగా చేయాలి. దాన్ని ఒళ్లంతా పట్టించి, కింది నుంచి పైకి స్ట్రోక్‌ చేస్తున్నట్లుగా మర్దనా చేయాలి. ఆపై ముని వేళ్లతో వృత్తాకారంలో మరోసారి రుద్దితే చాలు. ఆపై సున్ని లేదా సెనగపిండి ఒళ్లంతా పట్టించి, కొద్దిగా తడిచేస్తూ 5-10 నిమిషాలు రుద్ది స్నానం చేసేయండి.

* ఈ నూనెల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. గోరువెచ్చగా రాయడం వల్ల చర్మరంధ్రాలు తెరచుకుంటాయి. దీంతో వాటిల్లో పేరుకున్న దుమ్మూధూళి సున్నిపిండితో రుద్దినపుడు తేలిగ్గా బయటకు వచ్చేస్తాయి. నూనెతో మర్దన చర్మం పీహెచ్‌ స్థాయులను సమన్వయం, శరీరమంతటికీ రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దీంతో అలసటా తగ్గుతుంది.. మేనుకీ సహజ మెరుపు! నూనెలు తేమను లాక్‌ చేస్తాయి. కాబట్టి, ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలూ దరి చేరవు.

* సున్నిపిండిని తులసి, పసుపు, వేప, బియ్యప్పిండి, నారింజ తొక్కల పొడి.. లాంటివెన్నో కలిపి చేస్తారు. ఇది స్క్రబ్‌లా పనిచేసి, మృత కణాలను తొలగించడమే కాదు.. పోషకాలనూ అందిస్తుంది. మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ను రానీయదు. నునుపుదనం తెస్తూనే చర్మ సమస్యలను దూరంచేస్తుంది. సున్నిపిండి లేకపోతే సెనగ పిండి వాడొచ్చు. సెనగపిండి ట్యాన్‌ను దూరం చేసి, చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. మచ్చలతోపాటు నూగు వెంట్రుకలనూ తొలగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్