సులువుగా.. అందంగా!

పండగ.. ఆత్మీయులంతా ఒకచోట చేరతారు. అలాంటప్పుడు అందంగా కనిపించాలి... సంప్రదాయంగానూ ఉండాలి. కాబట్టి ఎక్కువ మందిని ఆకట్టుకుంటోన్న నేచురల్‌ లుక్‌కి జై కొట్టేయండి.

Published : 15 Jan 2023 00:44 IST

పండగ.. ఆత్మీయులంతా ఒకచోట చేరతారు. అలాంటప్పుడు అందంగా కనిపించాలి... సంప్రదాయంగానూ ఉండాలి. కాబట్టి ఎక్కువ మందిని ఆకట్టుకుంటోన్న నేచురల్‌ లుక్‌కి జై కొట్టేయండి. సిద్ధమవడమూ సులువే!

* ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ఆపై ప్రైమర్‌ రాయాలి. మేకప్‌ ముఖమంతా సరిగా పరచుకోవడంలోనూ, ఎక్కువ సేపు నిలిచి ఉండటంలోనూ ఇది సాయపడుతుంది.

* బీబీ క్రీమ్‌, ఫౌండేషన్‌ ఏది వాడుతున్నారు? ఫౌండేషన్‌ అయితే కొన్ని చుక్కల ఫేస్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి రాయండి. బీబీ క్రీమ్‌ అయితే ఎస్‌పీఎఫ్‌ ఉన్నది తీసుకుంటే మేలు. మచ్చలు, కళ్ల కింద నలుపు వంటివి ఉంటే ఆ ప్రదేశాల్లో కొద్దిగా కన్సీలర్‌ రాయాలి. ఆపై మేకప్‌ పౌడర్‌తో ముఖమంతా రాస్తే సరి.

* కాటుక లేకుండా తయారీ పూర్తవదు కదా! కాబట్టి, కాటుకతో కళ్లను అందంగా తీర్చిదిద్దేయండి. ఓపిక ఉంటే రెప్పపై నుంచి కనుమొనల వరకూ ఐలైనర్‌ అద్దితే కళ్లు ఇంకా అందంగా కనిపిస్తాయి. అందుబాటులో లేదనిపిస్తే కాటుకతోనే కనుమొనల్లో విల్లులా గీస్తే సరి.

* పెదాలకు లేత రంగు ఎరుపు లేదా గులాబీ.. ఎంచుకున్న దుస్తుల ఆధారంగా ప్రయత్నించేయండి. లిప్‌ బామ్‌ రాశాకే లిప్‌స్టిక్‌ వేయాలి. లిప్‌గ్లాస్‌ వేస్తే పెదాలూ సహజంగా మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఇంకా.. ఆ లిప్‌ స్టిక్‌నే బుగ్గలు, కళ్లపై అద్దితే ముఖానికి ఇంకాస్త ప్రత్యేకతా వస్తుంది. మీడియం సైజు బొట్టు, చెవులకు కాస్త పెద్ద జుంకీలు.. చాలు. ఏ సంప్రదాయ వస్త్రాలు వేసుకున్నా.. మెప్పించడం ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్