చిన్నచిట్కాలే మెరిపిస్తాయి!

తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి... ఈ రోజున కట్టుకునేందుకు పట్టుకి మరేవి సాటి వస్తాయి చెప్పండి. అలాగని కొత్తవే కానక్కర్లేదు... గతంలో పండగలూ, వేడుకలకి కొన్నవి చాలానే ఉండి ఉంటాయి. వాటిలో నచ్చిన దాన్ని ఎంచుకోండి.

Published : 15 Jan 2023 00:44 IST

పండగ రోజు ప్రత్యేకంగా కనిపించాలనీ, అందరిలోనూ మెరిసిపోవాలనీ కోరుకోవడం సహజమే. ఆ అభిరుచికి ఈ చిట్కాలు తోడైతే.... పండగ కళంతా మీ మోములోనే తొణికిసలాడదూ...

* తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి... ఈ రోజున కట్టుకునేందుకు పట్టుకి మరేవి సాటి వస్తాయి చెప్పండి. అలాగని కొత్తవే కానక్కర్లేదు... గతంలో పండగలూ, వేడుకలకి కొన్నవి చాలానే ఉండి ఉంటాయి. వాటిలో నచ్చిన దాన్ని ఎంచుకోండి. చీర, లాంగ్‌ గౌన్‌ ఏదైనా సరే దానిపై దుపట్టాని ప్లీట్స్‌తో బటర్‌ఫ్లై, హాఫ్‌మూన్‌... తరహాలో కట్టేయొచ్చు. చీరే కట్టుకోవాలనుకునే వారు... మహారాణీ స్టైల్‌లో డబుల్‌ పల్లూ వచ్చేలా కట్టేయొచ్చు. ఇక, రాణీహారమో, రామ్‌ పరివారో వేసుకుంటే ఆ లుక్కే వేరు.

* పండగరోజైనా చీరకట్టుతో మెరిసిపోవాలనుకునే ఈతరం అమ్మాయిలు క్రాప్‌టాప్‌, షరారా రకాలతో వచ్చే ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ ప్లీటెడ్‌ శారీలనూ ఎంచుకోవచ్చు. లేదంటే మీరే ప్లెయిన్‌ షరారా, క్రాప్‌ టాప్‌లకు హెవీ ఎంబ్రాయిడరీ దుపట్టాతో శారీ, లంగాఓణీ స్టైల్‌లో డ్రేప్‌ చేసేయొచ్చు. అవేవీ కాదనుకున్నప్పుడు వన్‌మినిట్‌  చీరలు ఎలాగూ ట్రెండ్‌లోనే ఉన్నాయి. వాటిని ఎంచుకోవచ్చు.

* పండక్కి కొన్న దుస్తులకు ఖరీదు ఎక్కువనో, సమయం లేదనో ఎంబ్రాయిడరీ చేయించలేదని బాధ పడక్కర్లేదిప్పుడు. ప్లెయిన్‌గా, సింపుల్‌గా ఉన్న వస్త్రశ్రేణి ఏదైనా సరే... ఆడంబరంగా కనిపించేలా చేస్తున్నాయి ఎటాచ్డ్‌ ఎంబ్రాయిడరీ స్లీవ్స్‌, నెక్స్‌... నప్పే మ్యాచింగ్‌లో వీటిని ఎంచుకోవచ్చు. దుస్తులు ఏ తరహా అయినా హెవీ ఎంబ్రాయిడరీ బెల్టులూ మన స్టైల్‌నే మార్చేస్తాయి. టెంపుల్‌ డిజైనర్‌ నెక్లెస్‌లూ, గాజులూ... సందర్భానికి సరైన ఎంపిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్