అల్లంతో ముంజేతుల అందం

వేళ్లకు ఉంగరాలు, నఖ సౌందర్యానికి రంగులు వేసినంత మాత్రాన చేతికి అందం రాదు. ముంజేతులు మెరుపులీనితేనే.. మిగతావన్నీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వంటింటి పదార్థాలతోనే ముంజేతులను తళుక్కుమనేలా చేసుకోవచ్చంటున్నారు చర్మసౌందర్య నిపుణులు.

Published : 17 Jan 2023 00:14 IST

వేళ్లకు ఉంగరాలు, నఖ సౌందర్యానికి రంగులు వేసినంత మాత్రాన చేతికి అందం రాదు. ముంజేతులు మెరుపులీనితేనే.. మిగతావన్నీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వంటింటి పదార్థాలతోనే ముంజేతులను తళుక్కుమనేలా చేసుకోవచ్చంటున్నారు చర్మసౌందర్య నిపుణులు.

విటమిన్‌ ఈ..

ర్మంపై పేరుకొన్న మృత కణాలను తొలగించడానికి విటమిన్‌ ఈ మసాజ్‌ మంచి ప్రయోజనాన్నిస్తుంది. రెండు చెంచాల బ్రౌన్‌ షుగర్‌కు అయిదారు చుక్కల విటమిన్‌ ఈ ఆయిల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని రాసి 2, 3 నిమిషాలు స్క్రబ్‌ చేసి కడిగితే చాలు. చర్మం కాంతులీనుతుంది.


చక్కెరతో..

చెంచా చొప్పున కొబ్బరినూనె, తేనె కలిపిన మిశ్రమానికి పావు కప్పు చొప్పున చక్కెర, సీసాల్ట్‌, అయిదారు చుక్కల నిమ్మరసం వేయాలి. మరోసారి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతులకు రాసి మూడునాలుగు నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. పొడారి, నల్లబడిన చర్మం మృదువుగా, మెరిసేలా మారుతుంది.


కాఫీపొడితో..

ర్మాన్ని పూర్వపుస్థితికి తీసుకొచ్చి మెరిసేలా కాఫీపొడి చేయగలదు. మూడు చెంచాల కాఫీ పొడి, రెండు చెంచాల కొబ్బరినూనె, చెంచా చక్కెర కలిపిన మిశ్రమాన్ని ముంజేతులకు రాసి మృదువుగా రుద్దాలి. ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగితేచాలు.


చేతుల చర్మంపై చేరే మురికిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే ముంజేతులు, వేళ్ల కణుపుల వద్ద నలుపు దనంతోపాటు పొడిబారినట్లు మారుతుంది. ఈ మురికిని స్క్రబ్బింగ్‌తో పోగొట్టొచ్చు. దీని కోసం... కప్పు ఎప్సమ్‌ సాల్ట్‌లో కప్పు ఆలివ్‌ లేదా గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌ను కలిపిన మిశ్రమాన్ని ముంజేతులకు రాసి రెండుమూడు నిమిషాలు మృదువుగా స్క్రబ్‌ చేసి కడిగితే చాలు. చర్మమంతా మృదువుగా, మెరుపులీనుతుంది.

అల్లంతో..

100 గ్రాముల అల్లంను చెంచా కొబ్బరినూనె కలిపిన పావుకప్పు నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి వడకట్టాలి. నీటిలో నానబెట్టి మిక్సీలో వేసిన 3,4 బాదం పప్పుల మిశ్రమాన్ని ముందుగా వడకట్టి ఉంచిన అల్లం నీటికి కలపాలి. ఇందులో చెంచా చక్కెరవేసి ముంజేతులకు రాసి స్క్రబ్‌ చేసి ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్