Published : 19/01/2023 00:48 IST

మేనుని మెరిపించే లావెండర్‌

అరోమా థెరపీ నుంచి అందాన్ని పెంచేవరకూ అన్నింట్లోనూ ఎసెన్షియల్‌ నూనెలే కీలకం. అందులోనూ లావెండర్‌ ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవేంటో చూద్దామా!

* చర్మాన్ని మచ్చలూ, మృత కణాలూ నిర్జీవంగా మార్చేస్తాయి. వీటిని మాయం చేసి ముఖాన్ని మెరిపించే శక్తి లావెండర్‌ నూనెకే ఉంది. చెంచా బాదం ముద్దకి రెండు చుక్కల ఈ తైలాన్ని కలపండి. ఒంటికి రాసి మృదువుగా రుద్ది చూడండి. మేను మెరిసిపోతుంది.

* రెండు చుక్కల లావెండర్‌ నూనెని పావు కప్పు బ్రౌన్‌ షుగర్‌లో కలిపేయండి. దీన్ని స్నానం చేసేముందు ఒంటికి రాసుకుని రుద్దుకోండి. రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలూ, యాక్నే వంటి ఇబ్బందుల్ని తగ్గిస్తుంది.

* జుట్టు పొడి బారి ఇబ్బంది పెడుతున్నప్పుడు.. ఈ తైలాన్ని నువ్వుల నూనెలో కలిపి తలకు పట్టించి మర్దన చేయండి. ఆపై గంటాగి తలకు ఆవిరి పట్టండి. ఈ మిశ్రమం కుదుళ్లను బలంగా మారుస్తుంది.

* తక్కువ సమయంలో చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే... రెండు చెంచాల అరటిపండు గుజ్జుకి చెంచా తేనె, రెండు చుక్కల లావెండర్‌ నూనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఓ పావు గంట ఉంచాక ముఖాన్ని సవ్య, అపసవ్య దిశల్లో రుద్దుతూ మర్దన చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని