చలివేళా.. స్టైల్‌గా!

పగలు ఎండ మండిపోతున్నా.. రాత్రుళ్లు విపరీతమైన చలిగా ఉంటోంది. ఈ సమయంలో ఏదైనా వేడుకలో పాల్గొనాలా? చలి చంపేస్తోంటే.. స్టైల్‌గా, అందంగా కనిపించడమెలా అని ఆలోచిస్తున్నారా? చిట్కాలివిగో! సంప్రదాయం, ఆధునిక వస్త్రాలకు అనువుగా ‘థర్మల్‌ వేర్‌’ దొరుకుతున్నాయి.

Published : 21 Jan 2023 00:03 IST

పగలు ఎండ మండిపోతున్నా.. రాత్రుళ్లు విపరీతమైన చలిగా ఉంటోంది. ఈ సమయంలో ఏదైనా వేడుకలో పాల్గొనాలా? చలి చంపేస్తోంటే.. స్టైల్‌గా, అందంగా కనిపించడమెలా అని ఆలోచిస్తున్నారా? చిట్కాలివిగో!

సంప్రదాయం, ఆధునిక వస్త్రాలకు అనువుగా ‘థర్మల్‌ వేర్‌’ దొరుకుతున్నాయి. ఒంటికి అంటినట్లుగా ఉండే వాటిని వేసుకొని, పైన నచ్చిన వస్త్రాలను వేసుకుంటే సరి. చలి దరికి చేరదు. లేదూ ఎంబ్లిష్‌డ్‌, హెవీ వర్క్‌ శాలువాను లెహెంగా, సల్వార్‌లకు జోడిస్తే స్టేట్‌మెంట్‌ దుప్పట్టాగా మారిపోతుంది.

వెల్వెట్‌, రా సిల్క్‌, బనారసీ రకాలను ఎంచుకోండి. కాస్త మందంగా ఉంటాయి. రాయల్‌ లుక్‌నీ ఇస్తాయి. కాస్త హెవీ వర్క్‌, స్టైల్‌గా ఉన్నవి ఎంచుకుంటే శరీరానికీ హాయి.. అందానికీ అందం.

క్రేప్‌ శారీ అయినా.. భారీ, తేలికపాటి లెహెంగా అయినా ‘ఫర్‌ కోట్‌’ను జోడించేయండి. ఫ్యాషన్‌ ట్రెండ్‌ పట్టేసినవారవుతారు. షార్ట్‌ కోట్‌లు ఇప్పుడు చీరలకు మంచి జత కూడా! తేలిక వస్త్రాలే మీ మంత్రమైతే.. చీర, పలాజో, లాంగ్‌ స్కర్ట్‌.. రకమేదైనా లాంగ్‌ కోట్‌ వేసేయండి.. తారలూ మెచ్చిన స్టైల్‌ ఇది. చీరకట్టి కోట్‌ వేసినా.. కోట్‌ మీదుగా పైట వచ్చేలా వేసుకున్నా.. లుక్‌ అదిరిపోవడం మాత్రం ఖాయం.

వేడుకల్లో పడి కాళ్ల సంగతి మరచిపోయేరు! కాలంతా కప్పేలా షూని ఎంచుకున్నా.. రాళ్లు, ఎంబ్రాయిడరీ ఉన్నవి ఎంచుకుంటే స్టైల్‌ మిస్‌ అయ్యే అవకాశమే ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్