అందానికి... ఆవిరి మంత్రం!

ముఖం అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు. ఇందుకోసం మనకు తెలిసిన అన్ని బ్యూటీ టెక్నిక్‌లూ పాటించేస్తాం. వాటన్నింటినీ పక్కన ఉంచి ఈసారి ఆవిరి పట్టి చూడండి. కచ్చితంగా మీ మోము మెరిసిపోతుంది. చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్మూ, ధూళీ, ఇతర మలినాలను శుభ్రపరచడానికి ఆవిరి ఉపయోగపడుతుంది.

Published : 21 Jan 2023 00:03 IST

ముఖం అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు. ఇందుకోసం మనకు తెలిసిన అన్ని బ్యూటీ టెక్నిక్‌లూ పాటించేస్తాం. వాటన్నింటినీ పక్కన ఉంచి ఈసారి ఆవిరి పట్టి చూడండి. కచ్చితంగా మీ మోము మెరిసిపోతుంది.

చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్మూ, ధూళీ, ఇతర మలినాలను శుభ్రపరచడానికి ఆవిరి ఉపయోగపడుతుంది. సాధారణంగా బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్‌ని తీయాలంటే నొప్పి తప్పదు. కానీ ఆవిరి పడితే... వాటిని సులువుగా తీసేయొచ్చు. మృతకణాలు బయటికి వచ్చేస్తాయి. ఫలితంగా మొటిమలు తగ్గుతాయి.

ఆవిరి చర్మానికి తేమనందిస్తుంది. అలాగని ఎక్కువ సేపు పెడితే... నూనె స్రవించే సహజ గ్రంథులు పొడి బారిపోతాయి. అవి ముడతలకు దారి తీయొచ్చు.

మోము సహజ మెరుపుతో కనిపించాలంటే... ఆవిరి పట్టాలి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఫలితంగా కొలాజెన్‌, ఎలాస్టిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో చర్మం యౌవనంగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్