బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా

మనలో చాలామందికి మార్కెట్లో వచ్చిన కొత్తరకం దుస్తుల్ని కొనేయడం అలవాటు. అవి తమకు నప్పుతాయా లేదా అని చూడకుండా కొనుగోలు చేస్తుంటారు.

Published : 25 Jan 2023 00:20 IST

నలో చాలామందికి మార్కెట్లో వచ్చిన కొత్తరకం దుస్తుల్ని కొనేయడం అలవాటు. అవి తమకు నప్పుతాయా లేదా అని చూడకుండా కొనుగోలు చేస్తుంటారు. నిజానికి అన్నీ అందరికీ నప్పవు. కానీ పెప్లమ్‌ దుస్తులు మాత్రం ఇందుకు మినహాయింపు. ఇవి కాలేజ్‌ పిల్లల నుంచి ఉద్యోగినుల వరకూ అందరికీ బాగుంటాయి. సన్నటి మెరుపు తీగలకీ, బొద్దుగా ఉండే ముద్దు గుమ్మలకీ కూడా భేషుగ్గా ఉంటాయి.

అటు గ్లామరస్‌గా, ఇటు ప్రొఫెషనల్‌గా కనిపించాలంటే పెప్లమ్‌ టాప్స్‌ ఉత్తమ ఎంపిక అంటున్నారు కాస్ట్యూమ్‌ డిజైనర్లు. మన అభిరుచికి నచ్చే రకం ఎంచుకుని ప్రశంసలు కొట్టేయడమే తరువాయి. ఇవి ట్యాపర్డ్‌ ప్యాంట్లు, స్కిన్నీ జీన్స్‌, నేరో పెన్సిల్‌ స్కర్టుల మీదకు మరింత అందంగా కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్