అందానికి.. జూతీ!

రోజువారీ దుస్తుల నుంచి ఆఫీస్‌, పార్టీవేర్‌కు మ్యాచ్‌ అయ్యే జూతీలిప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఏయే ఆహార్యంతో ఎటువంటివి జత కడతాయో చూద్దాం.

Published : 27 Jan 2023 00:22 IST

రోజువారీ దుస్తుల నుంచి ఆఫీస్‌, పార్టీవేర్‌కు మ్యాచ్‌ అయ్యే జూతీలిప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఏయే ఆహార్యంతో ఎటువంటివి జత కడతాయో చూద్దాం.

రోజూవారీ లేదా అత్యవసరానికి ధరించే డెనిమ్‌, తెలుపు చొక్కాపై జరీ దారంతో వర్క్‌ చేసిన లేతవర్ణం బూట్లు సరిగ్గా నప్పుతాయి. ముదురు, లేత వర్ణం దారాలతో చేసిన పూలతల డిజైన్‌ పాదాలకు అందంగా ఇమిడిపోవడమే కాకుండా జీన్స్‌పైకి ప్రత్యేకమైన లుక్‌ తెచ్చిపెడతాయి.

ఆకర్షణీయంగా.. ప్రత్యేక సందర్భాల్లో అవుట్‌ఫిట్స్‌ను ఎరుపు, ఆకుపచ్చ వంటి ముదురువర్ణంలో ఎంపిక చేసినప్పుడు అదే వర్ణంలో ఎంబ్రయిడరీ చేసిన జూతీలు సరిగ్గా నప్పుతాయి. అలాగే రాళ్లు పొదిగినవైతే మరింత ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి.
పార్టీలకు చీర ధరించినప్పుడు లేత లావెండర్‌, గులాబీ వర్ణం బూట్లపై జరీ పనితనం ఉంటే దానికి మించిన ప్రత్యేకత మరేదీ ఉండదు.

కుర్తీలపై.. లేత వర్ణంపై సన్నని దారంతో చేసిన ఎంబ్రాయిడరీకి చెమ్కీలల్లిన సీక్వెన్స్‌ వర్క్‌ ఉన్న బూట్లు కుర్తీ, లెహెంగా, గౌన్లపై నప్పుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు చీర, లెహెంగా వంటి పార్టీవేర్స్‌పై బంగారు వర్ణం దారంతో ఎంబ్రాయిడరీ పనితనం ఉన్న బూట్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. షరారాకి మాత్రం పసుపు వర్ణం జూతీలపై మిర్రర్‌ వర్క్‌ ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. సింపుల్‌గా ఉండాలా? చూడటానికి సాధారణంగా అనిపిస్తూనే ఫినిషింగ్‌ టచ్‌లో ప్రత్యేకత కనిపించాలి. లేత గోధుమ లేదా నీలి వర్ణం పూసలతో సీక్వెన్స్‌ వర్క్‌ ఉండేలా ఎంపిక చేస్తే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్