మాయిశ్చరైజర్‌.. ఏది మంచిది?

మార్కెట్‌లో ఎన్నో బ్రాండ్లు. వాటిల్లో ఏది ఎంచుకోవాలన్న సందేహమా? నిపుణుల సూచనలివిగో!

Updated : 28 Jan 2023 03:29 IST

మార్కెట్‌లో ఎన్నో బ్రాండ్లు. వాటిల్లో ఏది ఎంచుకోవాలన్న సందేహమా? నిపుణుల సూచనలివిగో!

* ఏది ఎంచుకోవాలో తెలుసుకునే ముందు వాటిలో ఏవి ఉండకూడదో చూసుకోమంటారు నిపుణులు. మాయిశ్చరైజర్‌ ఏదైనా.. కృత్రిమ సువాసనలు, స్టెరాయిడ్‌లు, యూరియా, మినరల్‌ ఆయిల్స్‌, పారాబెన్స్‌, ఫార్మాల్దిహైడ్‌ వంటి రసాయనాలు లేకుండా చూసుకోవడం ప్రధానం.

* పొడి చర్మం ఉన్నవారికి ఎక్కువ తేమ కావాలి. వీరు ఆయింట్‌మెంట్‌ తరహా క్రీములను ఎంచుకోవడం మేలు. హైలురోనిక్‌ యాసిడ్‌, డైమెథికాన్‌, గ్లిజరిన్‌, ప్రొటీన్లు ఉన్నవి మంచివి. నీటి ఆధారితమైనవి జిడ్డు చర్మం వారికి సరిపడతాయి. ఆల్ఫాహైడ్రాక్సి యాసిడ్‌లు, సెరామిడ్‌లున్న నాన్‌ కమెడోజెనిక్‌ రకాలు వీళ్లకి సరైనవి. సాధారణ చర్మం ఉన్నవారు మరీ జిడ్డు, మరీ నీళ్ల తరహా కాని లోషన్లను వాడొచ్చు. ఏ తరహా చర్మమైనా క్రీముల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకుంటే చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.

* ఉదయమైతే ఎస్‌పీఎఫ్‌ ఉన్నదీ, రాత్రి అయితే యాంటీ ఏజింగ్‌ గుణాలున్నవీ ఎంచుకుంటే మేలు. అలాగే తేమకే పరిమితం కాకుండా ప్రత్యేక అవసరాలు తీరేలా ఉందో లేదో చెక్‌ చేసుకోవడమూ ముఖ్యమే. ఉదాహరణకు మొటిమలు, చర్మం నిర్జీవంగా మారడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టేలాంటివి కొనాలి. ఇతర చర్మ సమస్యలేమైనా ఉంటే మాత్రం వైద్యుల సలహా ప్రకారమే వాడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్