ఆనందానికి 6 సూత్రాలు

ఇంటా బయటా ఎన్ని పనులు, ఎంత ఒత్తిడి ఉన్నా మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం కూడా అవసరమే. మనం ఆనందంగా ఉంటూ ఇతరుల మన్ననలందుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.

Published : 30 Jan 2023 00:03 IST

ఇంటా బయటా ఎన్ని పనులు, ఎంత ఒత్తిడి ఉన్నా మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం కూడా అవసరమే. మనం ఆనందంగా ఉంటూ ఇతరుల మన్ననలందుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం ఈ తేలికైన సూత్రాలు పాటించమంటున్నారు సైకాలజిస్టులు.

* రోజూ చేసే వంటే, నిత్యం వెళ్లే ఆఫీసే అయినా అవి రొటీన్‌గా, మొక్కుబడిగా మారకుండా చూసుకోవాలి. దేనిమీదైనా ఆసక్తీ, అనురక్తీ ఉన్నప్పుడు నీరసం, నిస్సత్తువా తలెత్తవు. కొత్తదనాన్ని జోడించుకుంటాం. మెరుగుదల కోసం ప్రయత్నిస్తాం.

* బయట దొరికే సౌందర్య సాధనాల్లో రసాయనాలు ఉంటాయి కనుక అవి మేలు కంటే కీడే చేస్తాయి. పాలు, తేనె, పసుపు, పండ్ల గుజ్జు, కూరగాయల చెక్కు.. ఇలా సహజమైనవాటితో ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి. ముఖం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది, డబ్బు ఆదా చేసినట్లూ అవుతుంది.

* టీవీ, మొబైల్‌ రోజుల్లో పుస్తకాలేంటి అనుకోకుండా రోజులో అరగంటయినా పుస్తకం చదవండి. అది ఎంత ప్రశాంత తనిస్తుందో మీకే అర్థమవుతుంది.

 చిన్న గంధపు చెక్కలను వార్డ్‌రోబ్‌ అరల్లో పెట్టండి. సూక్ష్మ క్రిములు చేరకపోవడమే కాదు, దుస్తుల పరిమళం మనసుకు హాయి కలిగిస్తుంది.

* గోళ్లను అందంగా కత్తిరించడం, నెయిల్‌ ఆర్ట్‌ లాంటి అతి చిన్న విషయాలకు కూడా బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా? ఇంత తేలికైనవి ఇంట్లోనే చేసుకోవచ్చు. డబ్బు ఆదా అవ్వడమే కాదు, మీరు స్వయంగా చేసుకోవడంలో సంతృప్తి ఉంటుంది.

* వారానికో రోజైనా హడావుడి లేకుండా ఇష్టమైన సంగీతం వింటూ నెమ్మదిగా నురుగుస్నానం (బబుల్‌ బాత్‌) లేదా గోరువెచ్చటి నీటితో షవర్‌ బాత్‌ చేస్తూ ఆస్వాదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్