సన్‌స్క్రీన్‌ ఎలా వాడాలంటే...

ఓ పక్కన చలి తగ్గనేలేదు. అప్పుడే సూర్యుడు తన ప్రతాపం చూపించేస్తున్నాడు. మరి ముఖానికి ట్యాన్‌ పట్టకూడదన్నా, ఎండ ప్రభావానికి చర్మం పాడవకూడదన్నా... సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవడం తప్పనిసరి. దాన్నెలా వాడాలో తెలుసుకుందామా!

Published : 01 Feb 2023 00:21 IST

ఓ పక్కన చలి తగ్గనేలేదు. అప్పుడే సూర్యుడు తన ప్రతాపం చూపించేస్తున్నాడు. మరి ముఖానికి ట్యాన్‌ పట్టకూడదన్నా, ఎండ ప్రభావానికి చర్మం పాడవకూడదన్నా... సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవడం తప్పనిసరి. దాన్నెలా వాడాలో తెలుసుకుందామా!

* సన్‌స్క్రీన్‌లోషన్‌ జిడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో కొందరు ఇష్టపడరు. ఎక్కువ వినియోగిస్తే ఇలాంటి సమస్యే ఎదురవుతుంది. చిన్న సెనగ గింజ పరిమాణంలో వాడితే చాలు. జిడ్డు చర్మతత్వం కలవారు...ఆయిల్‌ ఫ్రీ, వాటర్‌ బేస్డ్‌ రకాలను ఎంచుకుంటే మేలు.

* మీరు వాడే సన్‌స్క్రీన్‌లోషన్‌లో సన్‌ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ కనీసం (ఎస్‌పీఎఫ్‌)15 శాతమైనా ఉండేలా చూసుకోండి. ముప్పై వరకూ ఉంటే మరీ మంచిది. డై ఆక్సైడ్‌ బెంజీన్‌, ఆల్కహాల్‌ ఆధారిత ఉత్పత్తులకు మాత్రం దూరంగా ఉండాలి.

* ఎక్కువమంది సన్‌స్క్రీన్‌ లోషన్‌ని మేకప్‌ చేసుకునేటప్పుడు మాత్రమే వాడతారు. కొందరేమో ముఖానికి మాత్రమే రాసుకుంటారు. రెండూ సరికాదు. సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రోజూ తప్పకుండా ఉపయోగించాలి. ఎండ తగిలే మెడ, చేతులు వంటి చోట్లా రాసుకోవాలి. అయితే, ఇది రోజుకి ఒక సారి వాడితే సరిపోదు. కనీసం నాలుగైదు సార్లైనా రాసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్