క్రీములే సరిపోవు!

చర్మ సంరక్షణ ప్రక్రియ (స్కిన్‌ కేర్‌ రొటీన్‌)లో భాగంగా పగలు, రాత్రి భిన్నమైన క్రీములను రాస్తుంటాం.

Published : 02 Feb 2023 00:04 IST

చర్మ సంరక్షణ ప్రక్రియ (స్కిన్‌ కేర్‌ రొటీన్‌)లో భాగంగా పగలు, రాత్రి భిన్నమైన క్రీములను రాస్తుంటాం. ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించడంలో భాగమే ఇదంతా! మరి.. దిండు గలీబుల సంగతేంటి? దీనికీ దానికీ సంబంధమేంటనుకుంటున్నారా? చాలా ఉంది!

* పడుకున్నప్పుడు ముఖచర్మం అంటి పెట్టుకొనేది దిండు గలీబునే. ప్రతిరోజూ మార్చం. కాబట్టి, ముందు రోజు ముఖం మీది క్రీములు, తలలోని నూనె, దుమ్ము, చెమట వంటివన్నీ చేరేది దిండు మీదకే! రోజుల తరబడి మార్చకపోతే సూక్ష్మక్రిములూ చేరతాయి. ఫలితమే యాక్నే, అలర్జీలు.

* దుస్తులు, పక్కదుప్పట్లు మృదువుగా, సువాసనలతో నిండాలని ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్స్‌ వాడుతున్నారా? వాటిల్లో ఉండే రసాయనాలు చర్మానికి చేటు చేస్తాయంటున్నారు నిపుణులు.

* ఎక్కువ కాలం మన్నుతాయి, మెత్తగా ఉంటాయని కాటన్‌వే ఉపయోగిస్తారు చాలామంది. అయితే ఇవి కురులకు చేటు చేస్తాయట. వెంట్రుకల చివర్లు చిట్లడం, తెగడానికి కారణమవుతాయట. ముఖాన్నీ పొడిబారేలా చేస్తాయి. కాబట్టి, సిల్క్‌ రకాలు ఎంచుకోమంటారు.

* దిండ్లనూ ఏళ్లపాటు వాడకూడదు. వాటిలోపలికి దుమ్ము చేరడంతోపాటు సూక్ష్మజీవులకూ ఆవాసంగా మారతాయి. కాబట్టి, గలీబులు మార్చడమే కాదు.. దిండ్లనూ తరచూ మార్చాలి. లేదంటే చర్మమే కాదు.. రోగనిరోధకత పైనా దుష్ప్రభావం పడుతుంది. అందుకే రాత్రులు నాణ్యమైన క్రీములు వాడటమే కాదు.. చర్మానికి అతి దగ్గరగా ఉండే దిండు, గలీబుల సంగతీ గమనించుకుంటూ ఉంటేనే అందం సంరక్షణ పరిపూర్ణమైనట్టు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్