బాదంతో భలే అందం!

అందంగా కని పించాలని ఎవరికి ఉండదు?! అందుకే రకరకాల క్రీములు ఉపయోగిస్తాం, అనేక గృహ చిట్కాలనూ పాటిస్తాం. అందులో బాదంపప్పు మరీ మంచిదని తేలింది. ఇది అతి తక్కువ సమయంలోనే తళుక్కున మెరిసేలా చేస్తుంది. ఇంతకీ బాదంపప్పుతో సౌందర్య పోషణ ఎలాగంటారా.. పెద్ద కష్టమేం లేదు.  ఇలా చేసి చూడండి...

Published : 06 Feb 2023 00:18 IST

అందంగా కని పించాలని ఎవరికి ఉండదు?! అందుకే రకరకాల క్రీములు ఉపయోగిస్తాం, అనేక గృహ చిట్కాలనూ పాటిస్తాం. అందులో బాదంపప్పు మరీ మంచిదని తేలింది. ఇది అతి తక్కువ సమయంలోనే తళుక్కున మెరిసేలా చేస్తుంది. ఇంతకీ బాదంపప్పుతో సౌందర్య పోషణ ఎలాగంటారా.. పెద్ద కష్టమేం లేదు.  ఇలా చేసి చూడండి...

గుప్పెడు బాదం గింజల్ని మెత్తగా రుబ్బి కాస్త నిమ్మరసం, పావుకప్పు బొప్పాయి గుజ్జు, నాలుగు చెంచాల బ్రౌన్‌షుగర్‌ కలపండి. ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగు పెట్టండి! ఇలా పది నిమిషాలు చేశాక గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయండి. మృతకణాలు తొలగి, చర్మం మృదువుగా మారుతుంది.

మసాజ్‌ చేయడం వల్ల వచ్చే మెరుపు అంతా ఇంతా కాదు. ముఖం, మెడ, చేతులకు బాదంనూనె రాసి మృదువుగా మర్దన చేయండి. ఇలా పావుగంటసేపు చేయగలిగితే చాలు.. రక్తప్రసరణ సక్రమంగా జరిగి ముఖానికి తేటదనం, తేజస్సు వస్తాయి.

ముద్దగా నూరిన బాదం పేస్టులో కాసిని పాలు, చెంచా తేనె, చెంచా పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేయండి. దాన్ని ఫేస్‌ప్యాక్‌లా వేసి ఆరాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్