Published : 08/02/2023 00:17 IST

మేను వన్నెల కోసం...

బయటికి వెళ్తే ఎండకి, ఇంట్లో ఉంటే లైట్ల కాంతికి ముఖంపై నలుపు పేరుకుపోతుంది. దీన్ని తొలగించుకోకపోతే ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు పాటించండి.

* రెండు చెంచాల బార్లీ పౌడర్‌ని పాలల్లో ఉడికించి చెంచా తేనె కలిపి ముఖానికి పూత వేసి పదిహేను నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే...నలుపు తగ్గుతుంది.

* రెండు చెంచాల చొప్పున ముల్తానీ మట్టి, పెసరపిండి సమాన పరిమాణంలో తీసుకుని దానికి పావుకప్పు కీరదోస రసం, కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరాక కడిగేస్తే చాలు. మీ సమస్య దూరమవుతుంది. చర్మ ఛాయా మెరుగుపడుతుంది.

* కప్పు గులాబీరేకల ముద్దకు రెండు చెంచాల బాదం పేస్ట్‌, కాసిని పాలు, టేబుల్‌ స్పూన్‌ సెనగపిండి కలిపి ఒంటికి రాసుకుని నలుగులా రుద్దండి.  చర్మంపై మృతకణాలు తొలగి మేను మృదువుగా మెరిసిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని