మెరిపించే మార్గాలివిగో!

సరిగ్గా ఏదైనా వేడుక ఉంటుందా వచ్చేస్తుందండీ పింపుల్‌! అందంగా కనిపించాలనుకున్నప్పుడే అలసట వేధిస్తుంటుంది. ఈ ప్రత్యేక రోజున మీదీ ఇదే పరిస్థితా? మెరిపించే చిట్కాలివిగో..

Published : 14 Feb 2023 00:23 IST

సరిగ్గా ఏదైనా వేడుక ఉంటుందా వచ్చేస్తుందండీ పింపుల్‌! అందంగా కనిపించాలనుకున్నప్పుడే అలసట వేధిస్తుంటుంది. ఈ ప్రత్యేక రోజున మీదీ ఇదే పరిస్థితా? మెరిపించే చిట్కాలివిగో..

* ప్రత్యేకమైన రోజున మరింత అందంగా కనిపించాలనుకోవడం సహజమే! ఈ సమయంలో వచ్చే మొటిమలు లుక్‌ని మార్చేస్తుంటాయి. వేప పొడిలో తగినన్ని గులాబీ నీటిని కలిపి ముఖానికి పట్టించేయండి. ఆరాక తడిచేసుకుంటూ వృత్తాకారంలో ముఖమంతా రుద్దితే సరి. మొటిమల పరిమాణాన్ని తగ్గించడమే కాదు చర్మానికీ లోతైన శుభ్రత. సమయం లేదనుకుంటే పింపుల్‌ ప్యాచ్‌లనూ ఆశ్రయించొచ్చు.

* నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి, ఎండలో తిరగడం.. చర్మంలో తేమను పోగొట్టేవెన్నో! మేకప్‌ వేసినా ఆ వెలితి కనిపిస్తూనే ఉంటుంది. ఉదయం లేవగానే ముఖాన్ని శుభ్రం చేసుకొని కొబ్బరి లేదా బాదం నూనెను ముఖానికి, ఒంటికి పట్టించేయండి. స్నానం తర్వాత హైలురోనిక్‌ యాసిడ్‌ లేదా విటమిన్‌ ఇ నూనెలున్న మాయిశ్చరైజర్‌ని రాస్తే సరి. చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

* అందమైన చర్మానికి పార్లర్‌కి వెళదామనుకుంటున్నారా? అసలే ఎక్కువమంది ఉండే సమయమిది. సమయాభావం. చాక్లెట్‌ లేదా ఓట్‌మీల్‌ స్క్రబ్‌తో ముఖాన్ని రుద్దేయండి. అందుబాటులో లేకపోతే బియ్యప్పిండి, బాదం పొడి, శనగపిండిల్లో ఏదో ఒకదాన్ని టేబుల్‌ స్పూను తీసుకొని దానికి చెంచా చొప్పున పాలపొడి, తేనె కలిపి ముఖానికి అయిదు నిమిషాలు రుద్దేయండి. ఆపై నచ్చిన పండు లేదా టొమాటోగానీ, బంగాళాదుంప రసం కానీ పట్టించి, ఆరాక కడిగేస్తే సహజ మెరుపు వచ్చేసినట్టే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్