వేద్దామా సిగరెట్‌ ప్యాంట్‌!

మెత్తగా, మృదువుగా శాటిన్‌ వస్త్రాన్ని తలపించే సిగరెట్‌ ప్యాంట్లు ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉంటాయి. టైట్‌గానో, వదులుగానో లేక సమంగా ఉండి ట్రెండీ లుక్‌తో గ్లామర్‌ను తెచ్చిపెడతాయి.

Published : 16 Feb 2023 00:58 IST

మెత్తగా, మృదువుగా శాటిన్‌ వస్త్రాన్ని తలపించే సిగరెట్‌ ప్యాంట్లు ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉంటాయి. టైట్‌గానో, వదులుగానో లేక సమంగా ఉండి ట్రెండీ లుక్‌తో గ్లామర్‌ను తెచ్చిపెడతాయి. షార్ట్‌ టాప్స్‌ అందాన్ని మరింత పెంచే ఈ హైవెయిస్ట్‌ ట్రౌజర్స్‌ మోడరన్‌ అప్‌డేట్‌తో క్లాసిక్‌ స్టయిల్‌ను అందించి పొగడ్తలను తెచ్చిపెడతాయి. ఆధునికతను ప్రతిఫలించే అందాల గుండీలు, ఫోనూ గట్రా పెట్టుకోవడానికి సైడ్‌ పాకెట్లు అదనపు ఆకర్షణలు. చూపులకు సున్నితంగా కనిపించినా రఫ్‌ అండ్‌ టఫ్‌గా ధరించవచ్చు. కాలేజీ, ఆఫీసు, వీకెండ్‌ పార్టీలు.. ఏ సందర్భానికైనా నప్పే ట్రౌజర్స్‌ అమ్మాయిల మనసును తెగ దోచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్