సీరమ్‌ వాడుతున్నారా?

చర్మ సంరక్షణ విషయంలో ఈతరం అమ్మాయిలు పక్కాగా ఉంటున్నారు. లేయర్లుగా క్రీములు వాడాల్సి వస్తున్నా ఓపికగా ప్రయత్నించేవారే ఎక్కువ.

Updated : 21 Feb 2023 05:29 IST

చర్మ సంరక్షణ విషయంలో ఈతరం అమ్మాయిలు పక్కాగా ఉంటున్నారు. లేయర్లుగా క్రీములు వాడాల్సి వస్తున్నా ఓపికగా ప్రయత్నించేవారే ఎక్కువ. అలా తప్పనిసరిగా ఉపయోగిస్తున్న వాటిల్లో సీరమ్‌ ఒకటి! మరి.. వీటిని గమనించుకుంటున్నారా?

* చర్మం నిగనిగలాడాలి, మృదువుగా తయారవ్వాలి, ముడతలు దరిచేరొద్దంటూ... అవసరాన్ని బట్టి ఒక్కో సీరమ్‌ వాడేస్తున్నారు. పగలు, రాత్రి వేర్వేరుగా వాడేవారూ లేకపోలేదు. సరైనది ఎంచుకోవడమే కాదు సరైన సమయంలో రాస్తున్నామా అన్నదీ ముఖ్యమే! ఉదాహరణకి రెటినాల్‌ని రాత్రి మాత్రమే రాయాలి. కొన్ని పగలు రాసేవాటికి సన్‌స్క్రీన్‌ తప్పనిసరి. ఈ జాగ్రత్తలు తెలుసుకున్నాకే వాడటం మొదలుపెట్టండి.

* సీరమ్‌ల్లోనూ సంస్థను బట్టి వాడే పదార్థాల మోతాదుల్లో తేడా ఉంటాయి. దేన్నైనా ప్రారంభ దశలోనే ఎక్కువ మోతాదులో వాడితే చర్మానికి సరిపడక కొత్త సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి, తక్కువ మోతాదువే మొదట ప్రయత్నించండి.

* ఎప్పుడు, ఎలా వాడాలన్నది ప్యాక్‌ మీద స్పష్టంగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని అనుసరించక తప్పదు. అలాగే సూచనల మేరకు ఎప్పుడెప్పుడు ఉపయోగించాలన్నదీ పాటిస్తేనే కోరుకున్న ఫలితం పొందొచ్చు.కొనేప్పుడు తుది గడువు చూసుకుంటాం కదా! వాడటం ప్రారంభించాక ఎన్నిరోజుల్లో వాడేయాలి అని ఉంటుంది. దాన్నీ గమనించుకోవాలి. తీరా ఆ గడువు ముగిసినా వాడితే దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అది గుర్తుండటం కాస్త కష్టమే. కాబట్టి, ప్రారంభించిన రోజే తేదీ రాసిపెట్టుకుంటే సమస్య ఉండదు.

* ప్యాకేజీపై ఎలా భద్రపరచాలన్నది ఉంటుంది. దాన్నీ అనుసరిస్తేనే కోరుకున్న ఫలితం దక్కుతుంది. కొన్నిసార్లు కొందరిలో ఒక్కో సీరమ్‌ ఒక్కో కాలంలోనే పడుతుంది. అకస్మాత్తుగా ఏవైనా చర్మసమస్యలు ఎదురవుతోంటే సీరమ్‌ ఆపేసి చూడండి. సమస్య తగ్గితే చర్మతీరుకి అనువైనది మరొకటి ఎంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్