అందానికి.. బొప్పాయి గింజలు

బొప్పాయి గింజల్లో పుష్కలంగా ఉండే ఎంజైమ్స్‌ చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కెరొటిన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి. చర్మసౌందర్యాన్ని పెంపొందించే ఔషధగుణాలు వీటిలో మెండుగా ఉంటాయి. చెంచా బొప్పాయి గింజలను మిక్సీలో మెత్తగా చేయాలి.

Published : 25 Feb 2023 00:27 IST

బొప్పాయి గింజల్లో పుష్కలంగా ఉండే ఎంజైమ్స్‌ చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కెరొటిన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి. చర్మసౌందర్యాన్ని పెంపొందించే ఔషధగుణాలు వీటిలో మెండుగా ఉంటాయి.

చెంచా బొప్పాయి గింజలను మిక్సీలో మెత్తగా చేయాలి. ఇందులో చెంచా చొప్పున కొబ్బరినూనె, తేనె, నాలుగైదు చుక్కల విటమిన్‌ సీ ఆయిల్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఆపై రెండు చుక్కల కొబ్బరినూనెతో ముఖాన్ని మృదువుగా మర్దన చేస్తే చాలు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే ఈ గింజల లేపనం చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేసి, మృదుత్వాన్ని అందిస్తుంది. యాంటీ ఏజింగ్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ముఖంపై గీతలను రానీయవు. కొలాజెన్‌ని పెంచుతాయి. ప్రొటీన్లు, విటమిన్లు సహా ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో ముఖాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్యఛాయలను దరి చేరనివ్వవు. వారానికి రెండు మూడుసార్లు వేసే ఈ లేపనంతో మెరుపులీనే ముఖారవిందాన్ని సొంతం చేసుకోవచ్చు.

స్క్రబింగ్‌గా..

ముందుగా రెండు చెంచాల బొప్పాయి గింజలను మిక్సీలో గరుకు మిశ్రమంగా చేసుకోవాలి. ఇందులో రెండు చెంచాల ఓట్స్‌ పొడి, చెంచా తేనె కలిపి ముఖానికి మృదువుగా రాసి అయిదు నిమిషాలు రుద్ది ఆరనివ్వాలి. ఆపై చల్లని నీటితో కడిగితే ముఖంపై పేరుకొన్న మృతకణాలు, మురికి దూరమై చర్మం మెరుపులీనుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్