ముత్యాలు... మెరుపు నిలిచేలా!

కాలంతో పాటు ఫ్యాషన్లు మారడం సహజం. కానీ, ఎన్నేళ్లు గడిచినా వన్నె తరగని ట్రెండ్‌ ముత్యాలదే. మగువల మనసు దోచే వీటిని భద్రంగా ఉంచుకోవడమెలానో చూద్దామా!

Published : 02 Mar 2023 00:10 IST

కాలంతో పాటు ఫ్యాషన్లు మారడం సహజం. కానీ, ఎన్నేళ్లు గడిచినా వన్నె తరగని ట్రెండ్‌ ముత్యాలదే. మగువల మనసు దోచే వీటిని భద్రంగా ఉంచుకోవడమెలానో చూద్దామా!

* కొనేటప్పుడు నాణ్యమైన ముత్యాలను ఎలానూ ఎంచుకుంటారు. అప్పుడే వాటిని ఎలా భద్రపరచాలో దుకాణదారుల్ని అడిగి తెలుసుకోగలిగితే మేలు. ముత్యాల నగలు వాడకం అయ్యాక... వాటిని కొన్నప్పుడు ఇచ్చే వెల్వెట్‌ బాక్సులోనే భద్రంగా పెట్టేస్తే సరి.  అయితే వాటిని లోపల పెట్టే ముందు మెత్తటి పొడివస్త్రంతో తుడవాలి. దీనివల్ల తేమ, కనిపించకుండా పేరుకున్న దుమ్ము వంటివి పోతాయి. తిరిగి వాటిని ఉపయోగించేప్పుడు కూడా సిల్క్‌ వస్త్రంతో ఓ సారి పాలిష్‌ చేయాలి. అప్పుడే అవి కాంతిమంతంగా కనిపిస్తాయి. 

* మేకప్‌, ఇతర అలంకరణ పూర్తిగా అయ్యాకే ముత్యాల నగల్ని వేసుకోవాలి. లేదంటే పరిమళాలు, ముఖానికి రాసుకునే క్రీముల్లోని రసాయనాల ప్రభావం ముత్యాలపై పడుతుంది. దాంతో అవి వాటి సహజ మెరుపుని కోల్పోతాయి.

* అతివేడి ముత్యం తన సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటిని నీటితో శుభ్రం చేయాలనుకున్నప్పుడు క్లోరిన్‌ కలిపిన నీటిని ఉపయోగించొద్దు. పూర్తి ముత్యాల నగలు కాకుండా బంగారం, వెండి నగల డిజైన్లలో అమరి ఉన్న ముత్యాలను శుభ్రం చేసేప్పుడు అమోనియాతో తయారు చేసిన క్లీనర్‌లను ఉపయోగించొద్దు. ఇవి ముత్యాలకు మెరుపునే కాదు.. నాణ్యత కోల్పోయేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్