వేసవిలో జుట్టు సమస్యకు చెక్‌ పెట్టేదాం..

వేసవి వచ్చిదంటే చాలు.. జుట్టు ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. శిరోజాలు ఎండుగడ్డిలా మారిపోతాయి. వేడి నేరుగా మాడుకు తగలడంతో తేలికగా చెమట పడుతుంది. దీంతో చుండ్రు సమస్య.

Updated : 03 Mar 2023 03:41 IST

వేసవి వచ్చిదంటే చాలు.. జుట్టు ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. శిరోజాలు ఎండుగడ్డిలా మారిపోతాయి. వేడి నేరుగా మాడుకు తగలడంతో తేలికగా చెమట పడుతుంది. దీంతో చుండ్రు సమస్య. అలాకాకుండా నిగారింపుతో కూడిన జుట్టు తిరిగి సొంతమవ్వాలంటే ఇలా చేయండి...

కలబంద.. ఈ వేసవి కాలంలో జుట్టు పొడిబారడం పెద్ద సమస్య. దీనికితోడు ఎండవేడికి చెమట వల్ల చికాకు. చివర్లు చిట్లడం అదనం. అటువంటప్పుడు కలబంద పట్టించండి. దీనిలోని సహజ గుణాలు జుట్టును నిత్యనూతనంగా ఉంటుంది.

పెరుగు.. సహజ కండిషనర్‌లా పనిచేస్తుంది. ఇందులోని లాక్టికామ్లం కుదుళ్లలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. వారంలో 3సార్లు కుదుళకు పట్టిస్తే చుండ్రు ఉండదు.

దువ్వెన.. కొందరికి దువ్వెనకు బదులుగా బ్రష్‌ను వాడటం అలవాటు. అందులోనూ మనం వాడేవన్నీ  ప్లాస్టిక్‌వే. చిక్కులు పడ్డప్పుడు జుట్టు రాలే ఆస్కారం ఎక్కువ. బదులుగా పెద్ద పళ్లతోకూడిన చెక్క దువ్వెనను ఉపయోగించడం మేలు.

* బిగుతుగా జడ వేయడం వల్ల జుట్టు మరింత రాలిపోతుంది. స్ట్రెయిట్‌నర్‌ లాంటివి ఈ కాలంలో తగ్గించాలి.

* రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. ఎప్పుడూ వాడే కొబ్బరినూనె కాకుండా అరటిపండు మాస్క్‌, నిమ్మరసంతోపాటుగా గుడ్డు, కలబంద వంటి మిశ్రమాలతో.. జుట్టుకు చక్కని ప్యాక్‌లు వేయవచ్చు. బయటికి వెళ్లినప్పుడు గొడుగు, స్కార్ప్‌లు వాడటం ఉత్తమం.

పుదీనా.. తాజా పుదీనాను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అప్లై చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్ల నుంచి జుట్టు శుభ్రపడుతుంది. పొడిబారడం నుంచి కాపాడటమేకాక ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్