ఆ కంగారు ఉండదిక!

ఎంత ముచ్చటపడి కొన్న డ్రెస్‌ అయినా మెడ కాస్త పెద్ద అయితే ఇబ్బందే! పిన్నిస్‌ పెడితే అందమే పోతుంది. చున్నీతోనో.. మరెలాగో కవర్‌ చేద్దామన్నా.. ధ్యాసంతా అక్కడే ఉంటుంది.

Published : 07 Mar 2023 00:01 IST

ఎంత ముచ్చటపడి కొన్న డ్రెస్‌ అయినా మెడ కాస్త పెద్ద అయితే ఇబ్బందే! పిన్నిస్‌ పెడితే అందమే పోతుంది. చున్నీతోనో.. మరెలాగో కవర్‌ చేద్దామన్నా.. ధ్యాసంతా అక్కడే ఉంటుంది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ కొన్ని ఉత్పత్తులు అందుబాటులోకొచ్చాయి.

* క్లిప్‌ ఆన్‌ మాక్‌ లేస్‌.. పైన లేస్‌ను అతికించిన ఒక చిన్న వస్త్రం ముక్కలా ఉంటుంది. దాని వెనక ప్రెస్‌ చేసేలా బటన్‌లు ఉంటాయి. వాటిని బ్రాకు జత చేస్తే సరిపోతుంది. డీప్‌నెక్‌ను అందమైన లేస్‌ కవర్‌ చేసేస్తుంది. భిన్న రంగుల్లోనూ దొరుకుతున్నాయి.

* కాస్త మోడర్న్‌ టచ్‌ కావాలంటే డిటాచబుల్‌ కాలర్‌ తెచ్చేసుకోవచ్చు. మొత్తం లేసుతో హై నెక్‌తో ఉంటుంది. డ్రెస్‌కు పైన, లోపలికి వచ్చేలా ఎలాగైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా డీప్‌ నెక్‌ కవర్‌ అవుతూనే దుస్తులకూ కొత్త అందాన్ని తెచ్చిపెట్టగలదు. కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో వెతికేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్