సోడాతో మెరుపు

పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది. పార్లర్లకు వెళ్లే సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పదార్థాలతోనే అందంగా మెరవటం ఎలాగో చూద్దాం. మనం వంటసోడాని నిత్యం ఏదో ఒక వంటలో ఉపయోగిస్తుంటాం. దీన్ని చర్మానికి ఉపయోగించి అందంగా మెరిసిపోవచ్చు కూడా. అదెలాగో చూద్దామా..

Published : 16 Mar 2023 00:23 IST

పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది. పార్లర్లకు వెళ్లే సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పదార్థాలతోనే అందంగా మెరవటం ఎలాగో చూద్దాం. మనం వంటసోడాని నిత్యం ఏదో ఒక వంటలో ఉపయోగిస్తుంటాం. దీన్ని చర్మానికి ఉపయోగించి అందంగా మెరిసిపోవచ్చు కూడా. అదెలాగో చూద్దామా..

తళుకులీనేలా.. చెంచా బేకింగ్‌సోడాతో రెండు చెంచాల కమలారసం కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు రాయాలి. 15నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత నీళ్లలో ముంచిన దూదితో తుడిచాక చన్నీళ్లతో కడగాలి. కమలాల్లో విటమిన్‌ సి ఉంటుంది. ఇది చర్మంపై కొలాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే చర్మంపై ఉండే మలినాలను తొలగించి చర్మాన్ని మెరిపిస్తుంది.

మొటిమలను తొలగిద్దాం.. ముఖంపై మొటిమలను, మచ్చలను తొలగించేందుకు సోడా చక్కటి ప్యాక్‌లా ఉపయోగపడుతుంది. చెంచా వంటసోడాతో రెండు చెంచాల నీటిని కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. దాన్ని ముఖానికి రాసి రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మంపై ఉండే రంధ్రాలు తెరుచుకుంటాయి. ఐస్‌క్యూబ్‌తో కొద్దిసేపు మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తే మొటిమలు  తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతులీనుతుంది.

పెదాల కోసం.. లిప్‌స్టిక్‌ని గంటల తరబడి అలాగే ఉంచటం వల్ల పెదాలు సహజ సౌందర్యాన్ని కోల్పోయి నిర్జీవంగా మరతాయి. ఇలాంటి సమయంలో బేకింగ్‌సోడా, తేనె సమపాళ్లలో ఒక చెంచా చొప్పున తీసుకొని కలపాలి. పెదాలు మరీ పొడిబారి ఉంటే సోడా కంటే ఎక్కువ మోతాదులో తేనె తీసుకోవాలి. దీన్ని పెదాలకు రాసి సున్నితంగా వ్యతిరేక దిశలో మర్దన చేయాలి. ఈ మిశ్రమం పెదాలపై మృతకణాలు తొలగిపోయి, తేమ అందేలా చేస్తుంది. కొద్ది నిమిషాల తేడాతో దీన్ని రెండు సార్లు రాసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని ఎస్‌పీఎఫ్‌ ఉన్న లిప్‌బామ్‌ని రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే చక్కని గులాబీరంగు పెదాలు మీ సొంతం.

దుర్వాసన లేకుండా.. శరీరాన్ని తాజాగా ఉంచటమే కాకుండా చెమట వాసన రాకుండా ఉంచేందుకు వంటసోడా చక్కగా పని చేస్తుంది. తాజా నిమ్మరసంతో, వంటసోడాని సమపాళ్లలో తీసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. దీన్ని మెడ, చెమట ఎక్కువగా ఉండే బాహుమూలల్లో రాయాలి. 15నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఒక వారం ఇలా ప్రతిరోజూ చేసి చూడండి శరీరం తాజాగా ఉంటుంది. తేడా మీరే గమనిస్తారు. మీకూ నచ్చాయి కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్