సహజంగా కాపాడదామా!

ఈ కాలం వేడిగాలులు, హానికర యూవీ కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ట్యాన్‌, దద్దుర్లు, నిర్జీవంగా తయారవడం వంటివన్నీ వీటి పరిణామాలే! పరిరక్షణ కోసం రసాయనాలతో కూడిన క్రీముల వాడకం ఇంకాస్త చేటు చేయొచ్చు. సహజంగా కాపాడేద్దామా? రెండు స్పూన్ల ఓట్స్‌కి తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి.

Published : 18 Mar 2023 00:05 IST

ఈ కాలం వేడిగాలులు, హానికర యూవీ కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ట్యాన్‌, దద్దుర్లు, నిర్జీవంగా తయారవడం వంటివన్నీ వీటి పరిణామాలే! పరిరక్షణ కోసం రసాయనాలతో కూడిన క్రీముల వాడకం ఇంకాస్త చేటు చేయొచ్చు. సహజంగా కాపాడేద్దామా?

రెండు స్పూన్ల ఓట్స్‌కి తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దానికి చెంచా చొప్పున టొమాటో, నారింజ గుజ్జు కలిపి పేస్ట్‌లా చేయాలి. శుభ్రం చేసుకున్న ముఖానికి, మెడకీ పట్టించి ఆరనివ్వాలి. తర్వాత చేతుల్ని కొద్దికొద్దిగా తడిచేసుకుంటూ కడిగేయాలి. టొమాటో, నారింజ ట్యాన్‌ని పోగొడితే, పాలు నిగారింపు తెచ్చిపెడతాయి.

నిగనిగలాడే చర్మం కావాలా? బాగా పండిన బొప్పాయి ముక్క తీసుకొని మెత్తగా మెదపాలి. ఆ గుజ్జును ముఖానికి పట్టించి, ఆరనిచ్చి కడిగితే సరి. దీనిలోని ఎంజైమ్‌లు మృతకణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

2-3 స్పూన్ల ముల్తానీ మట్టికి చిటికెడు సేంద్రియ పసుపు, తగినన్ని గులాబీనీళ్లు కలిపి చిక్కని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి ఆరాక కడిగేయాలి. ముల్తానీ మట్టి చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి, జిడ్డు తొలగించి ముఖాన్ని తేటగా మారుస్తుంది. పసుపు ట్యాన్‌ని తొలగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్