వేసవిలోనూ.. స్టైల్‌గా

ఎండలు మొదలయ్యాయి. వేసవికి తగ్గట్లు వార్డ్‌రోబ్‌లో ఏ దుస్తులుండాలో ఫ్యాషన్‌ నిపుణులు సూచిస్తున్నారిలా.. ఆఫీస్‌ వేళల్లో రోజంతా ధరించినా సౌకర్యంగా ఉండాలి.

Published : 19 Mar 2023 00:11 IST

ఎండలు మొదలయ్యాయి. వేసవికి తగ్గట్లు వార్డ్‌రోబ్‌లో ఏ దుస్తులుండాలో ఫ్యాషన్‌ నిపుణులు సూచిస్తున్నారిలా..

ఆఫీస్‌ వేళల్లో రోజంతా ధరించినా సౌకర్యంగా ఉండాలి. సాయంకాలం స్నేహితులను కలవడానికీ, పెళ్లిళ్లు, పార్టీలంటూ ఆయా సందర్భాల్లోనూ సౌకర్యాన్నిస్తూనే ఆకర్షణీయంగా కనిపించాలి. వార్డ్‌రోబ్‌ ఇలా ఉండేలా చూసుకోవాలి. ముందు చలికాలం ధరించిన ఊలు కోట్లు, సిల్కు దుస్తులు వంటివన్నీ పై అరకు పంపేయాలి. ఇక అవసరం లేవనే వాటిని ఓ అట్టపెట్టెలో సర్దితే సరి. పేదవారికిస్తే వాళ్లకి ఉపయోగపడతాయి.. వార్డ్‌రోబ్‌ ఖాళీ అవుతుంది. మనసుకీ తృప్తి.

జీన్స్‌కు విడిగా.. ఎండాకాలంతో పూల అందాలు వచ్చేసినట్లే. ఆర్గంజా, సాదా కాటన్‌ లేతవర్ణాలపై పూల డిజైన్ల ప్రింట్లున్న మాక్సీ డ్రెస్సులు సాయంకాలాలకు నప్పుతాయి. ఆఫీస్‌కి కాటన్‌ కుర్తీలు, సల్వార్‌, చూడీదార్‌, వదులైన పలాజోలు సౌకర్యంగా ఉంటాయి. వీటికి మ్యాచింగ్‌గా పెన్సిల్‌ లేదా కాటన్‌ జీన్స్‌, లినెన్‌ ప్యాంట్లు, లెగ్గింగ్స్‌ సరిపోతాయి. వీటన్నింటినీ విడివిడిగా అలమరలో సర్దుకోవాలి. వారాంతాలకి తెలుపు, గులాబీ, నీలం వర్ణాల్లో కాటన్‌ టీ షర్ట్‌లు, వాటిపై వదులైన జాకెట్‌ ఉంటే.. షాపింగ్‌, స్నేహితులను కలవడానికి అనువుగా ఉంటాయి. పార్టీ అయితే కాటన్‌ బ్లేజర్‌ ఆహా అనిపిస్తుంది. లేత, ముదురు వర్ణాల్లో నాలుగైదు కాటన్‌ బ్లేజర్లు, అయిదారు టీ షర్టులను కొని పెట్టుకోండి. టై డై బనియన్లు మరీ ప్రత్యేకం. స్టైల్‌గా కనిపించాలంటే టాంక్‌ టాప్స్‌ రెండు మూడు ఉండాల్సిందే. వదులుగా వేసవి వేడిని తట్టుకొంటూ హాయిగా అనిపిస్తాయి. ఇవి జీన్స్‌ లేదా స్కర్టులపైనా బాగుంటాయి.

మెరిసి.. మెత్తగా, మృదువైన లినెన్‌ చీరలు రోజంతా హాయినిస్తాయి. లేత వర్ణాల్లో కొత్త ఆకర్షణనూ తెచ్చిపెడతాయి. అందరిలో మెరిసిపోవడం మీ వంతు అవుతుంది. బాందినీ కుర్తాలూ వేసవికి సరైన ఎంపికే! ఫ్యాన్సీగా కనిపించాలనుకున్నా మృదుత్వానికీ ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే సౌకర్యంగా అనిపిస్తుంది. చివరగా స్కార్ఫ్‌లకీ చోటివ్వండి. అన్ని వర్ణాలవీ తెచ్చుకుంటే ఆయా దుస్తులకు తగినట్లు ధరించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్