వేసవిలో సెంటు వాడుతున్నారా?

వేసవిలో చెమట, దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి పరిమళద్రవ్యాల్ని ఎక్కువగా వాడేస్తుంటారు.  దీర్ఘకాలం ఉపయోగించినా, సరైన దిశలో వినియోగించకపోయినా ఇబ్బందులు తప్పవంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటంటే... డియోడరెంట్‌లు ఒంటి దుర్వాసనకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుని కొన్ని గంటలపాటు శరీరం నుంచి సువాసనల్ని వెదజల్లుతాయి.

Published : 23 Mar 2023 00:09 IST

వేసవిలో చెమట, దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి పరిమళద్రవ్యాల్ని ఎక్కువగా వాడేస్తుంటారు.  దీర్ఘకాలం ఉపయోగించినా, సరైన దిశలో వినియోగించకపోయినా ఇబ్బందులు తప్పవంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటంటే...

డియోడరెంట్‌లు ఒంటి దుర్వాసనకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుని కొన్ని గంటలపాటు శరీరం నుంచి సువాసనల్ని వెదజల్లుతాయి. అయితే, పరిమళాల తయారీలో రకరకాల రసాయనాలను వాడటం వల్ల దీర్ఘకాలంలో అలర్జీలతో పాటూ క్యాన్సర్‌ ముప్పూ ఎక్కువేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బదులుగా సహజంగా పూలూ, పండ్లతో చేసిన పరిమళాల్ని వినియోగించమని సూచిస్తున్నారు.  

డియోడరెంట్‌ల్లోని రసాయనాల వల్ల చర్మం త్వరగా తేమను కోల్పోతుంది. అలంకరణ పూర్తయ్యాక మాత్రమే వాడాలి. అదీ ఒంటిపై చల్లుకునేవి కాకుండా దుస్తులపై స్ప్రే చేసేవి అయితే మరీ మంచిది.

స్నానం చేసిన వెంటనేనో, చెమటలు పట్టినప్పుడో పరిమళాల్ని చల్లుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనామూ ఉండదు. తేమతో కలిసి...ఆ వాసనలు మరోలా అనిపిస్తాయి. శరీరం పూర్తిగా తడారాక, అలంకరణ అంతా పూర్తయ్యాక మాత్రమే వాడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్