అంతర్జాతీయ వేదికపై.. మన చీర!

చీర మన సంస్కృతిలో భాగం. అందాన్ని అద్దుతూనే హుందాతనం ఉట్టిపడేలా చేయడం దాని తత్వం. అందుకే మనవాళ్లు దేశీ వేడుకలే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆ సంప్రదాయాన్ని చాటుతున్నారు.

Published : 26 Mar 2023 00:25 IST

చీర మన సంస్కృతిలో భాగం. అందాన్ని అద్దుతూనే హుందాతనం ఉట్టిపడేలా చేయడం దాని తత్వం. అందుకే మనవాళ్లు దేశీ వేడుకలే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆ సంప్రదాయాన్ని చాటుతున్నారు. భారతీయత ఉట్టిపడేలా చేసిన తాజా విశేషాలను మీరూ చూసేయండి.

* ప్రకృతిపై ప్రేమ.. గర్భిణైనా భర్త ఆనందంలో భాగమవ్వాలనుకున్నారు ఉపాసన. పరాయిగడ్డపై విదేశీ వస్త్రధారణ కాదని భారతీయ సంప్రదాయానికే ఓటేశారామె. తెలంగాణ నేతకారులు నేసిన ఆఫ్‌ వైట్‌ శారీని కట్టుకున్నారామె. సస్టెయినబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఆవిడ ఇక్కడా దాన్ని పాటించారు. చేత్తో నేసిన పట్టు, వృథాతో రూపొందించిన చీర.. సహజ ముత్యాలు, 400 క్యారెట్ల రూబీతో చేసిన నెక్లెస్‌ ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు.


* తెలుగుదనం ఉట్టిపడిన వేళ.. అంతర్జాతీయంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, ‘నాటు నాటు’ ఎంత ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బృందాన్ని వెనక నుంచి నడిపించారు రమా రాజమౌళి, ఎంఎం శ్రీవల్లి. అవార్డుల వేళా వాళ్ల భాగస్వామికి తోడు నడిచిన వాళ్లు భారతీయతకూ అద్దం పట్టారు. గోల్డెన్‌ గ్లోబ్స్‌ వేడుకల వేళ కాంజీవరం, ఆస్కార్‌ వేళ పట్టు చీరల్లో తెలుగుదనం ఉట్టిపడేలా చేశారు.


* చీరలో స్టైల్‌గా.. ఫిల్మ్‌ ఫెస్టివలంటే తారలకు పండగే! వివిధ ఆధునిక వస్త్రాల్లో మెరిసిపోతారు. జెదాలో జరిగిన రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చీరకు ప్రాధాన్యమిచ్చారు కరీనా కపూర్‌. సీక్వెన్లతో నిండిన పెసర రంగు చీర, స్టేట్‌మెంట్‌ షాండ్లియర్‌ చెవిపోగులతో ప్రత్యేకంగా నిలిచారు.


బెనారస్‌లో మెరిసి.. ఆస్కార్‌

చేత పట్టుకొని విజయానందంతో మురిసిన గునీత్‌ మోంగాని అంత త్వరగా మరవలేం. గులాబీ రంగు బెనారసీ చీర, దానిపై ఏనుగుల ప్రింట్లు, పొడవైన చేతులున్న బ్లవుజుతో ఆ వేదిక మీద ప్రత్యేకంగా నిలిచారామె. సంప్రదాయ కట్టుకి సరిపోయేలా చెవులకు చిన్న దిద్దులు.. మెడలో వెండి చోకర్‌, మరో బంగారు చెయిన్‌. చీరకొంగుకు ఏనుగు ఆకారంలో చేసిన బ్రూచ్‌! తను నిర్మించిన డాక్యుమెంటరీనే కాదు.. దానిలో కనిపించిన ఏనుగులకు గుర్తుగా ఆ వేడుకలో ధరించిన ఈ చీర సహా అన్ని దుస్తులపైనా ఏనుగులు ఉండేలా చూసుకున్నారామె. ఆమె లుక్‌ని చూసి ముచ్చటపడి బెనారస్‌ ప్రత్యేకత గురించి విదేశీయులూ వెతికారట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్