ముఖానికి.. చల్లగా!

ఎండలోకి అలా వెళ్లొచ్చామో లేదో దప్పిక వేస్తుంటుంది. చల్లచల్లగా ఏదైనా తాగేయాలనిపిస్తుంది. చర్మం పరిస్థితీ అంతే! తేమ తగ్గిపోవడమే కాదు ఎర్రగా కందడం, చెమటకు దుమ్ము చేరి యాక్నే వంటి ఇబ్బందులకూ దారి తీస్తాయి. దానికీ చల్లదనాన్ని అందించేయండిలా..

Published : 28 Mar 2023 00:21 IST

ఎండలోకి అలా వెళ్లొచ్చామో లేదో దప్పిక వేస్తుంటుంది. చల్లచల్లగా ఏదైనా తాగేయాలనిపిస్తుంది. చర్మం పరిస్థితీ అంతే! తేమ తగ్గిపోవడమే కాదు ఎర్రగా కందడం, చెమటకు దుమ్ము చేరి యాక్నే వంటి ఇబ్బందులకూ దారి తీస్తాయి. దానికీ చల్లదనాన్ని అందించేయండిలా..

చిన్న ముక్క కీరదోసకి చెంచా చొప్పున కలబంద గుజ్జు, తేనె కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దాన్ని ముఖం, మెడకి పట్టించి, 15 నిమిషాలయ్యాక కడిగేస్తే సరి. చర్మానికి చల్లదనంతోపాటు కావాల్సిన తేమా అందుతుంది. వాపు, ఎర్రబడటం వంటివీ తగ్గుతాయి.

అయిదు స్పూన్ల పెరుగుకు 5-10 పుదీనా ఆకులు చేర్చి మెత్తగా చేసుకోవాలి. దాన్ని పావుగంటసేపు ముఖానికి రాసుకొని, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పుదీనా చల్లదనాన్నిస్తే పెరుగులోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, మెరుపునిస్తుంది.

స్పూను గంధానికి తగినన్ని గులాబీనీళ్లు కలిపి, ముఖానికి పట్టించండి. ఆరాక చల్లని నీటితో కడిగేస్తే సరి. ఈ లేపనంతో చర్మతాపం తగ్గడమే కాదు.. తగినంత తేమ అందుతుంది. ఛాయా మెరుగుపడుతుంది.

5 స్పూన్ల గ్రీన్‌టీకి స్పూను తేనె కలిపి ముఖానికి రాయండి. గ్రీన్‌టీ చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. తేనె తేమని అందిస్తూనే ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. అన్‌ ఈవెన్‌ టోన్‌నీ సరిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్