బ్లూబెర్రీస్‌తో చమక్కులు
చర్మం, కురులను సంరక్షించుకోవడానికి ఇప్పుడందరూ సహజ మార్గాలను ఎంచుకుంటున్నారు. అన్ని సూపర్ మార్కెట్లలో విరివిగా దొరుకుతున్న బ్లూబెర్రీస్ ఆరోగ్యానికే కాదు చర్మం, జుట్టు సంరక్షణకూ మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
చర్మం, కురులను సంరక్షించుకోవడానికి ఇప్పుడందరూ సహజ మార్గాలను ఎంచుకుంటున్నారు. అన్ని సూపర్ మార్కెట్లలో విరివిగా దొరుకుతున్న బ్లూబెర్రీస్ ఆరోగ్యానికే కాదు చర్మం, జుట్టు సంరక్షణకూ మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రయత్నించి చూడండి మరి.
ఫేస్‌ప్యాక్‌లా
బ్లూబెర్రీ ఫేస్‌ప్యాక్ వల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతాయి. ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలను ఇది నివారిస్తుంది. చర్మంలోని పీహెచ్ విలువల సమతుల్యతను కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. మొటిమలను నివారిస్తుంది. కళ్లకింది నల్లచారలను తగ్గిస్తుంది.
ఇలా చేయండి
8 నుంచి 10 బ్లూబెర్రీస్‌లో 2 చెంచాల ఓట్స్, నిమ్మరసం, 1 చెంచా తేనెను కలిపి మెత్తగా చేయాలి. దాన్ని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరి. మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్లు దీనిలో గంధం లేదా పసుపును జోడించవచ్చు. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం కాంతులీనుతుంది.
హెయిర్ మాస్క్‌లా
వీటిని తలకు పట్టించడం వల్ల మాడు ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. విటమిన్ ఎ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులోనిని సిట్రిక్ యాసిడ్ మాడు నుంచి వచ్చే అదనపు నూనెలను నియంత్రిస్తుంది. బట్టతల వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఏం చేయాలంటే
జుట్టు ఒత్తుదనాన్ని బట్టి బ్లూబెర్రీస్‌ని తీసుకోవాలి, వాటికి కలబంద గుజ్జు, పెరుగు కలిపి మెత్తగా చేయాలి. తరువాత 1 చెంచా నిమ్మరసం, తేనె వేయాలి. ఆ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి. జుట్టును చిన్న చిన్న పాయలుగా విడదీసి తలకు పట్టించి 30 నిమిషాలు ఆరనివ్వాలి. రసాయనాల్లేని షాంపూతో కడిగేస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.