మస్కారాని ఇలా వాడండి!

పండగే కానక్కర్లేదు...ఇంటినుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ అందానికి మెరుగులద్దుకోవడం సహజమే. అలాగని ప్రతిసారీ మేకప్‌ రొటీన్‌ మొత్తం అనుసరించక్కర్లేకుండా కళ్లకు కాజల్‌, మస్కారాలు చాలు ముఖాన్ని మెరిపించడానికి.

Published : 24 May 2023 00:49 IST

పండగే కానక్కర్లేదు...ఇంటినుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ అందానికి మెరుగులద్దుకోవడం సహజమే. అలాగని ప్రతిసారీ మేకప్‌ రొటీన్‌ మొత్తం అనుసరించక్కర్లేకుండా కళ్లకు కాజల్‌, మస్కారాలు చాలు ముఖాన్ని మెరిపించడానికి. మరి ఇందులో మస్కారాని ఎలా వాడాలో తెలుసుకుందామా!

* మస్కారా పెట్టుకునే ముందు చాలా మంది ఆ సీసాను పైకీ, కిందకు కదుపుతుంటారు. దానివల్ల రంగు చక్కగా అంటుకుంటుందనుకుంటే పొరపాటే. గాలి బుడగలు ఏర్పడి తొందరగా ఎండిపోవడం, పెచ్చులుగా  విడిపోవడం జరుగుతుంది. రంగు సరిగ్గా రావట్లేదనుకుంటే రెండు అరచేతుల మధ్యలో సీసా ఉంచి నెమ్మదిగా ముందుకూ, వెనక్కి దొర్లిస్తే చాలు.. చక్కగా వస్తుంది.

* నిద్రపోయే ముందు మస్కారా తప్పక శుభ్రం చేసుకోవాలి. ఎక్కువసేపు అలాగే ఉంచుకుంటే గట్టిపడి కనురెప్పలకు హాని కలుగుతుంది. కొన్నిసార్లు కంటికీ ముప్పు ఏర్పడొచ్చు.

* ఒకసారి మస్కారా రాసుకున్నాక కాసేపు ఆరనిచ్చి మరో కోటింగ్‌ వేయొచ్చు. ఇలా రెండు సార్లు చేస్తే చాలు. అంతకుమించి ఎన్నిసార్లు వేసినా ప్రయోజనం లేదు. కనురెప్పలు ఒత్తుగా కనిపించాలంటే  ముందు కాస్త బేబీపౌడర్‌ అద్ది ఆ తర్వాత మస్కారా రాసుకుంటే సరి. ఐల్యాష్‌ కర్లర్‌తో రెప్పలను నొక్కి ఆ తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా, చక్కగా కనబడతాయి.

*ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి మస్కారా వాడకూడదు. ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం. అలాగే గడువుతేదీ గుర్తుంచుకోవడం కూడా ముఖ్యమే. ఎంత ఖరీదు పెట్టి కొనుక్కున్నదైనా సరే మూడు నుంచి ఆరు నెలలకు మించి వాడకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్