తాజాదనాన్నిచ్చే మాస్క్‌లివీ!

వేసవిలో జిడ్డు, చెమట వంటి ఇబ్బందుల్ని అధిగమించి... ముఖాన్ని మెరిపించాలంటే... ఈ చిట్కాలు ప్రయత్నించండి! ఇందుకోసం ఇంట్లో ఉండే సహజ పదార్థాలే సరిపోతాయి.

Published : 25 May 2023 00:10 IST

వేసవిలో జిడ్డు, చెమట వంటి ఇబ్బందుల్ని అధిగమించి... ముఖాన్ని మెరిపించాలంటే... ఈ చిట్కాలు ప్రయత్నించండి! ఇందుకోసం ఇంట్లో ఉండే సహజ పదార్థాలే సరిపోతాయి. అవేంటంటే..

ఆలివ్‌ నూనెతో మర్దన : కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ని ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

చక్కెరతో స్క్రబ్‌ : ఈ స్క్రబ్‌ చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. దీని తయారీకి పంచదార, ఆలివ్‌ నూనెల్ని సమాన పరిమాణంలో తీసుకోవాలి. దీన్ని మోముకి రాసి... మృదువుగా రుద్దాలి. ఇలా కనీసం 15 నిమిషాలు చేస్తే సరి.

తేనె- నిమ్మ ఫేస్‌ప్యాక్‌ : తేనె, నిమ్మ రసాలను సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. తేనె చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా మారుస్తుంది. నిమ్మరసంలో ఉండే సి విటమిన్‌ చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

గులాబీనీరు : రోజ్‌వాటర్‌ సహజ టోనర్‌గా ఉపయోగపడుతుంది. ఇది చర్మ పీహెచ్‌ స్థాయుల్ని సమతుల్యం చేస్తుంది. ఫేస్‌ ప్యాక్‌లు పూర్తయ్యాక దీన్ని రాస్తే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్