చిట్టిబ్యాగులు..ఆకర్షించేస్తున్నాయ్‌!

ఎంత ఖరీదు పెట్టినా, మ్యాచింగ్‌ చూసుకున్నా హ్యాండు బ్యాగు అంతిమ లక్ష్యం.. అత్యవసర వస్తువులను పెట్టుకోవడానికే! కానీ ఈమధ్య సెలబ్రిటీల చేతుల్లో కనిపించీ, కనిపించనట్లు చిట్టి చిట్టి బ్యాగులు తళుక్కున మెరిసిపోతున్నాయ్‌.

Published : 26 May 2023 00:01 IST

ఎంత ఖరీదు పెట్టినా, మ్యాచింగ్‌ చూసుకున్నా హ్యాండు బ్యాగు అంతిమ లక్ష్యం.. అత్యవసర వస్తువులను పెట్టుకోవడానికే! కానీ ఈమధ్య సెలబ్రిటీల చేతుల్లో కనిపించీ, కనిపించనట్లు చిట్టి చిట్టి బ్యాగులు తళుక్కున మెరిసిపోతున్నాయ్‌. కనీసం లిప్‌స్టిక్‌ కూడా పట్టని వీటిని ఏం చేసుకోవడానికి అనేగా సందేహం? దుస్తులకు నప్పడంతోపాటు వీటిలో కొన్ని అవసరమైతే బ్రేస్‌లెట్‌, చెయిన్లు వంటి యాక్సెసరీల్లానూ మారతాయిట. అందుకే ఈషా అంబానీ, ప్రియాంక చోప్రా, అలియా భట్‌, రాధిక మర్చంట్‌, పూజా హెగ్దే వంటి ఎందరో వీటిపై మనసు పారేసుకున్నవారే! మీరూ ఒకటి కొనేసుకుందామని అనుకుంటున్నారా? ధర లక్షల్లోనే మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్